పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మైసూర్ పాక్ తెలియని భారతీయుడు ఎవరు చెప్పండి. కాని ఇక భారతీయులు ఊపేక్షించేది లేదు. మైసూర్ నుంచి పాక్ ను లేపేశారు. మైసూర్ పాక్ ప్లేస్ లో మైసూర్ శ్రీ అనే పేరును పెట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ పేరు చాలా మంది యాక్సప్ట్ చేస్తున్నారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఒక ప్రముఖ మిఠాయి దుకాణం తమ వద్ద విక్రయించే మైసూర్ పాక్ పేరును 'మైసూర్ శ్రీ'గా మార్చింది. మైసూర్ పాక్ మాత్రమే కాకుండా, మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ వంటి ఇతర మిఠాయిల పేర్ల చివర ఉన్న 'పాక్' పదాన్ని కూడా తొలగించి, వాటి స్థానంలో 'శ్రీ'ని చేర్చారు."దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లోనే కాదు, ప్రతి పౌరుడిలోనూ ఉండాలి. పాక్ పదాన్ని మనం పదే పదే తలచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
మైసూర్ పాక్ ను సృష్టించిన వ్యక్తి కకాసుర మునిమనవడు ఎస్ నటరాజ్ మాత్రం చాలా అభ్యంతరం తెలిపారు. మైసూర్ పాక్ పేరు మార్చడం సరికాదు. మనం పూర్వీకులు చాలా ఆలోచించే పెట్టారు. మూసూర్ పాక పేరు వాడకలో మైసూర్ పాక్ అయ్యింది. దీనిని మార్చేయడం సరికాదని అన్నారు.