viral: భార్య వేధింపులు తట్టుకోలేక మరో వ్యక్తి మృతి ..కంటతడిపెట్టిస్తున్న లెటర్ !

ముంబైలో ఓ వ్యక్తి  హోటల్ గదిలో ఉరివేసుకొని చనిపోయారు. ఇతను కూడా తన భార్య బాధభరించలేకే చనిపోయాడు. తన చావుకు కారణాలేంటో క్లియర్ గా లెటర్ లో రాసి చనిపోయాడు.

 


Published Mar 08, 2025 12:45:00 PM
postImages/2025-03-08/1741418257_howtoprovementalcrueltybywife.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  భార్యల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకునే భర్తల సంఖ్య ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది. లాస్ట్ మంథ్ లో బెంగుళూరు కు చెందిన అతుల్ కేసు తర్వాత ...ఇప్పుడు ముంబైలో ఓ వ్యక్తి  హోటల్ గదిలో ఉరివేసుకొని చనిపోయారు. ఇతను కూడా తన భార్య బాధభరించలేకే చనిపోయాడు. తన చావుకు కారణాలేంటో క్లియర్ గా లెటర్ లో రాసి చనిపోయాడు.

 
ముంబైలో యానిమేటర్ గా పనిచేస్తున్న నిశాంత్ త్రిపాఠి(41) గత శనివారం ముంబైలో సహారా హోటల్ రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు రోజుల నుంచి రూమ్ తలుపులు తెరవలేదు..అంతేకాకుండా డు నాట్ డిస్ట్రర్బ్ కబోర్డ్ పెట్టడంతో సిబ్బంది రెండు రోజులు డిస్ట్రర్బ్ చెయ్యలేదు. ఇక రూమ్ నుంచి ఏం సౌండ్స్ రాకపోవడంతో ..యాజమాన్యం మాస్టర్ కీ సాయంతో త్రిపాఠీ రూం ను తెరిచి చూసేసరికి ...ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తల్లి, మహిళా హక్కుల కార్యకర్త నీలం చతుర్వేది ఫిర్యాదుతో బాధితుడి భార్య అపూర్వ పరేఖ్, అత్త ప్రార్ధనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


త్రిపాఠి చనిపోయే ముందు కంపెనీ వెబ్ సైట్ లో సూసైడ్ నోట్ ను అప్ లోడ్ చేశారు. ఆ లెటర్ లో ‘‘ఓయ్ నిన్నే.. నీపై నాకు ప్రేమ అనంతం. నేను నీకు ప్రామీస్ చేస్తున్నా అది ఎప్పటికీ చెరిగిపోదు అంటూ.. భార్యను ఉద్దేశిస్తూ రాశాడు. అలాగే.. నా చావుకు నువ్వు, మీ అమ్మ కారణం. ఆ విషయం నా తల్లికి తెలుసు. కాబట్టి మీరు ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. ఆమెను ప్రశాంతంగా దు:ఖించనివ్వండి అంటూ లేఖలో త్రిపాఠి పేర్కొన్నాడు.నిశాంత్ తల్లి తన కొడుకు చావుతో  తనకు ప్రాణం పోయిందని ...ఇక్కడున్నది శవం మాత్రమేనని అన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wife sucide harrasment

Related Articles