FOOD: ​ "ఆమ్లెట్​ వెల్లుల్లి రైస్​" టేస్ట్ చేస్తే వదలరు !

ఈ ఆమ్లెట్ వెల్లుల్లి రైస్ ట్రై చెయ్యండి . పిల్లలకు నచ్చుతుంది. లంచ్ బాక్స్ కి కూడా అధ్భుతంగా ఉంటుంది ట్రై చెయ్యండి.


Published Jan 31, 2025 04:18:00 PM
postImages/2025-01-31/1738320578_omeletrice2031329hero01a7e0906fd73b49739f28717d01e6cc33.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అసలు ఈ పిల్లలు ఉన్నారే ...ఏం చేసినా తినరు..రోజు ఓ కొత్త ఐటమ్ ను తల్లి కనిపెట్టాల్సిందే. హెల్దీగా ఉండాలి ...అలాగే టేస్టీ గా ఉండాలి. ఈ ఆమ్లెట్ వెల్లుల్లి రైస్ ట్రై చెయ్యండి . పిల్లలకు నచ్చుతుంది. లంచ్ బాక్స్ కి కూడా అధ్భుతంగా ఉంటుంది ట్రై చెయ్యండి.


కావాల్సిన పదార్థాలు:

కోడిగుడ్లు - 3


వెల్లుల్లి రెబ్బలు - 15


కారం - 2 టీ స్పూన్లు


ఉప్పు - రుచికి సరిపడా


గరం మసాలా - అర టీ స్పూన్​


నూనె - 2 టేబుల్​ స్పూన్లు


జీలకర్ర - అర టీ స్పూన్​


పచ్చిమిర్చి - 2


ఉడికించిన అన్నం - 2 కప్పులు


మిరియాల పొడి - అర టీ స్పూన్​


సోయాసాస్​ - 1 టీ స్పూన్​


కొత్తిమీర తరుగు - కొద్దిగా


మొదట మూడు ఎగ్స్ తీసుకొండి. వాటిని బాగా బీట్ చేసి పక్కన పెట్టండి. మిక్సీజార్​లోకి వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి మెత్తగా పేస్ట్​ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ కాగిన తర్వాత జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత మీరు మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ను పచ్చివాసన పోయి నూనె పైకి తేలెంతవరకు మగ్గించుకోవాలి. ఇందులో మీరు బీట్ చేసుకున్న ఎగ్స్ వేసుకొండి. చిన్న ఫ్లేమ్ లో ఉడికించండి. తర్వాత కలుపుకొని ..ఉంచుకొండి. 


ఇప్పుడు కోడిగుడ్డులోకి ఉడికించిన అన్నం, మిరియాల పొడి, సోయా సాస్​ వేసి హై ఫ్లేమ్​ మీద 5 నిమిషాల పాటు కలుపుతూ టాస్​ చేయాలి. మీరు రాత్రి మిగిలిన రైస్ తో ఇలా ట్రై చెయ్యండి నో చెప్పలేరు. లాస్ట్ లో కాస్త కొత్తిమీర వేసి దింపేముందు ...ఓ నార్మల్ ఎగ్ ఆమ్లెట్ పైన పెట్టి కాస్త ఈ ఎగ్ ఆమ్లెట్ వెల్లుల్లి వేసి ఇస్తే సూపర్ అంటే సూపర్.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-benifits egg-born garlic-

Related Articles