ఏ కాలంలో ఉన్నాం మనం.. మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ సంపాదిస్తున్న రోజుల్లో ఉన్నాం. ఆడవాళ్లు చదువుకుంటున్నారు. నచ్చిన రంగంలో పై స్థాయిలకు చేరుకుంటున్నారు. కాని ఇంకా ఆడవారిని వంటింటి కుందేళ్లు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా మా మతంలో అది చెయ్యకూడదు..మా మతం లో ఆడవారికి స్వేచ్ఛ ఇవ్వకూడదు...లాంటి మాటలు వింటూనే ఉన్నాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏ కాలంలో ఉన్నాం మనం.. మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ సంపాదిస్తున్న రోజుల్లో ఉన్నాం. ఆడవాళ్లు చదువుకుంటున్నారు. నచ్చిన రంగంలో పై స్థాయిలకు చేరుకుంటున్నారు. కాని ఇంకా ఆడవారిని వంటింటి కుందేళ్లు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా మా మతంలో అది చెయ్యకూడదు..మా మతం లో ఆడవారికి స్వేచ్ఛ ఇవ్వకూడదు...లాంటి మాటలు వింటూనే ఉన్నాం.
తాజాగా పాకిస్థాన్ లో ఓ యూట్యూబర్ బాలికలను స్కూళ్లకు పంపడాన్ని తప్పుబడుతూ ఏకంగా ఓ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేశాడు. హఫీజ్ హసన్ ఇక్బాల్ ఛిస్తీ అనే యూట్యూబర్ తన పాటకు ‘అప్నీ దీ స్కూలో హాతా లే ఓథీ డ్యాన్స్ కర్దీ పాయీ ఆయీ’ అనే పేరుపెట్టాడు.
‘మీ అమ్మాయి స్కూల్లో డ్యాన్స్ లు చేస్తారు. అది మన మతానికి విరుధ్ధం .. ఆమెను బడి మాన్పించండి’ అన్నది ఆ పాట సారాంశం. ఇస్లాం మతాచారం ప్రకారం ఆడవాళ్లు డ్యాన్స్ చెయ్యకూడదు. అయితే యునెస్కో సూచనతో పాక్ లోని ఓ స్కూల్ బాలికలకు డ్యాన్స్ పోటీ నిర్వహించినట్లు ఓ వార్తాసంస్థ చూపించడంతో ఈ పాట మొదలవుతుంది.
దీనిని ప్రతిఘటిస్తూ ఈ పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఆపాటలో...ఎవరైతే తమ కూతుర్లను , చెల్లెలను ..వేశ్యలుగా ...చూడాలనుకుంటున్నారో వారే స్కూల్ కు పంపుతారు . ఇది ఆ పాటలో లిరిక్స్ . తెలిసిందేగా వేస్ట్ విషయాలకు ..వ్యూస్ ఎక్కువ సుమారు 3 లక్షల వ్యూస్, 3 వేలకుపైగా లైక్ లు రావడం పాక్ లో మతపిచ్చితో ఇబ్బందిపడే వారు చాలా మంది ఉన్నారని తెలిస్తుంది. పాక్ లో 75 శాతం మంది ఇలాంటి అతివాద మనస్తత్వంతోనే ఉన్నారు. అందుకే ప్రపంచ దేశాలతో పోలిస్తే పాకిస్థాన్ ఇంకా అభివృద్ది చెందలేదు’ అని విమర్శించారు.