వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంచి మనసు చాటుకున్నారు. అభిమానుల మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ..గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రిటర్న్ జర్నీ ఘటనల కుటుంబాలకు 10 లక్షల ఆర్ధిక సాయం చేశారు. రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ఈ నెల 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి లో చాలా గ్రాండ్ గా చేశారు. అయితే ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు.
తన అభిమానులు ఇలా చనిపోవడంతో రామ్ చరణ్ 10 లక్షలు ఆర్ధిక సాయాన్ని అందించారు. ఇద్దరు కుటుంబాలకు చెరొక ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రామ్ చరణ్ మాట్లాడుతూ… ”ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. మన డిప్యూటీ సీఎం కోరుకున్నది కూడా ఇదే. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. నా అభిమానులకు ఏదైనా చెడు జరిగితే మాకు చాలా బాధగా ఉంటుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు.