సొంత ఇంట్లోను సేఫ్టీ లేనట్టే ఫీలవుతున్నారు .కర్ణాటక లో ఓ స్కూల్ టీచర్ స్కూల్ బాత్రూమ్ లో కెమరా ఫిట్ చేశాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రోజుకో అత్యాచారం..ఎక్కడ చూసినా ఆడవారిపై అత్యాచారాలు ..వేధింపులు..రాను రాను జనరేషన్ ముందుకు పోతుంది. చదువులు , తెలివితేటలు వెధవ పనులకు వాడుతున్నారు. తండ్రి దగ్గర టీచర్ దగ్గర అన్న, తమ్ముడు ఎవ్వరి దగ్గర సేఫ్టీ లేదు. ఆడపిల్లలు ప్రతి సెకన్ భయపి బతకాల్సిందే. సొంత ఇంట్లోను సేఫ్టీ లేనట్టే ఫీలవుతున్నారు .కర్ణాటక లో ఓ స్కూల్ టీచర్ స్కూల్ బాత్రూమ్ లో కెమరా ఫిట్ చేశాడు.
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా మూలూరు తాలూకా మొరార్జీదేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఆ స్కూల్‌లో పనిచేసే డ్రాయింగ్ టీచర్ మునియప్ప.. బాలికల వీడియోలు తీస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో స్కూల్ వాళ్లు వెంటనే పోలీసులకు కంప్లైయింట్ చేశారు. పోక్సో చట్టం కింద మునియప్ప ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు విచారణ కూడా జరిపారు. అయితే ఆ స్కూల్ నుంచి మునియప్ప ను మరో స్కూల్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే అక్కడ కూడా అదే కంప్లైయంట్ రావడంతో మునియప్ప వద్ద సీజ్ చేసిన ఫోన్ డేటాను కలక్ట్ చేశారు. అప్పుడే పోలీసులకు షాకింగ్ న్యూస్ తెలిసింది.
మునియప్ప ఫోన్లలో వేల సంఖ్యలో అశ్లీల, నగ్న వీడియోలు, ఫోటోలు ఉండటం గమనించి నోరెళ్లబెట్టారు. మొత్తం 5 ఫోన్లు ఉండగా.. ఒక్కో ఫోన్లో వెయ్యికి పైగా వీడియోలు ఉన్నాయని గుర్తించారు. అందులో ఆ స్కూల్ విద్యార్థినుల వీడియోలు కూడా ఉండటం సంచలనం రేపింది. రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లో విద్యార్థినులు బట్టలు మార్చుకునేవి.. బాత్రూంలలో స్నానాలు చేసిన వీడియోలు కూడా ఉండటంతో.. బాలికల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎలా ఈ వీడియోలు తీశాడు...ఎవరికి పంపిండాడనే విషయం ఇంకా క్లారిటీ లేదు. విచారణ జరుపుతున్నారు.
తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని మునియప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన హైకోర్టు.. మునియప్ప చేసిన పని చాలా నీచమని, భయంకరమైందని వ్యాఖ్యానించింది. తన భవిషత్తు నాశనమవుతుందని కోర్టు దయ చూపాలని కోరిన మునియప్ప పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తనకు కఠిన శిక్ష తప్పదని వారించింది.