KF Beer : బీరు బాటిల్ లో సిగరెట్ పీక.. మరోచోట చెత్త

ఫ్రెండ్స్ తో కలిసి బీరేద్దామని బీర్ కొన్న యువకులకు బాటిల్ ఓపెన్ చేయకముందే కిక్కెక్కింది. ఎందుకా అనుకుంటున్నారా? సీల్ చేసిన బీర్ బాటిల్ లో సిగరెట్ పీక దర్శనమిచ్చింది. మరో చోట బీర్ అడుగు భాగంలో చెత్త పేరుకుపోయింది.


Published Jul 18, 2024 10:21:14 AM
postImages/2024-07-18/1721315766_narayanapurbeer.jpg

న్యూస్ లైన్ డెస్క్ : మందుబాబులు సరదాగా బీరేద్దామనుకుంటే.. బాటిల్లో చెత్త చెదారం, సిగరెట్ పీకలు కనిపించడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కాస్త నవ్వొచ్చినా ఇది నిజం. ఓ చోట ఫ్రెండ్స్ తో కలిసి బీరేద్దామని వైన్ష్ షాప్ కి వెళ్లి బీర్లు కొన్న యువకుడికి బీర్ బాటిల్ లో చెత్త చెదారం కనిపించింది. మరోచోట బీరులో కాల్చి పారేసిన సిగరెట్ పీక దర్శనమిచ్చి నారాజ్ చేసింది.

మహబూబాబాద్ పట్టణంలో అనిల్ అనే యువకుడు గురువారం నాడు వైన్ షాప్ కి వెళ్లి మూడు బీర్లు కొన్నాడు. ఇంటికి వెళ్లి బాటిల్ గమనించి చూడగా.. అందులో ఒకదాంట్లో చెత్త, చెదారం కనిపించింది. బీర్ బాటిల్ కాస్త షేక్ చేస్తే అడుగున పేరుకుపోయిన చెత్తంతా పైకి తేలడంతో షాక్ తిన్నాడు. నేరుగా వైన్ షాపు యజమానిని అడగగా మాకేం సంబంధం లేదంటూ సమాధానం ఇచ్చాడు.

ఇలాంటిదే మరో ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నారాయణపురం మండల కేంద్రంలోని సరళ మైసమ్మ వైన్ షాపులో యువకులు బీర్ బాటిల్ కొన్నారు. అందులో గమనించి చూస్తే తాగేసిన సిగరెట్ పీక కనిపించింది. దుకాణం యజమానిని అడిగితే.. మేము కేవలం అమ్మేవాళ్లమే.. ప్యాకింగ్ మాకు సంబంధం లేదు అని సమాధానం ఇచ్చారు. సరదాగా స్నేహితులతో కలిసి బీరేద్దామనుకుంటే ఇలా చెత్త చెదారం, సిగరెట్ పీకలు కలిపి బీర్ బాటిల్స్ సీల్ చేస్తే ఎలా అంటూ మందుబాబులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి ఖజానా నింపే మందుబాబుల మీద గౌరవం లేదా అంటూ మండిపడుతున్నారు.  ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడంతో బీరు బాబులు తాగకముందే తల పట్టుకుంటున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news viral viral-news

Related Articles