అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీ సత్యనారాణ వ్రతం చేసింది. అయితే, వ్రతం చేయించేందుకు అక్కడికి వెళ్లిన పండితుడు అటు తెలుగు, ఇటు సంస్కృతంలో కాకుండా ఇంగ్లీష్‌లో సత్యనారాయణ స్వామి కథను చెప్పాడు.
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా అయితే, సంస్కృత మంత్రాల్లో, లేదా తెలుగు భాషలోనో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. వినేవారికి సులభంగా అర్ధం అయ్యేందుకు తెలుగులో సత్యనారాయణ స్వామి వారి కథను చెప్తారు. అయితే, ఓ పండితుడు మాత్రం వింతగా ఇంగ్లీష్ భాషలో సత్యనారాయణ స్వామి కథను చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఒక నెట్టింట వైరల్ అవుతోంది.
అమెరికాలో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీ సత్యనారాణ వ్రతం చేసింది. అయితే, వ్రతం చేయించేందుకు అక్కడికి వెళ్లిన పండితుడు అటు తెలుగు, ఇటు సంస్కృతంలో కాకుండా ఇంగ్లీష్‌లో సత్యనారాయణ స్వామి కథను చెప్పాడు. అక్కడే పెరిగిన పిల్లలకు కూడా అర్ధమయ్యేలా కథను ఇంగ్లీష్‌లో చెప్పాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
అమెరికాలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఇంగ్లీషులో చెబుతున్న బ్రాహ్మణుడు pic.twitter.com/ISn6MtKlB8 — News Line Telugu (@NewsLineTelugu) August 3, 2024