కాల్పులు జరిగిన బైసరన్ వ్యాలీ ప్రదేశంలోనే ఒక టూరిస్ట్జిప్ లైన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఆ దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో రికార్డు చేసుకున్నాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు ..లైవ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఏవో పిక్స్ , వీడియోలు బయటకి వస్తూనే ఉన్నాయి. ఒక టూరిస్ట్ తన సరదా కోసం తీసుకున్న వీడియోలో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. కాల్పులు జరిగిన బైసరన్ వ్యాలీ ప్రదేశంలోనే ఒక టూరిస్ట్జిప్ లైన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఆ దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో రికార్డు చేసుకున్నాడు.
అయితే ఓ టూరిస్ట్ లైన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తూ ..తన ఆనందంలో తను ఉన్నాడు. సరదాగా గడుపుతున్నాడు కాని కింద ఏం జరుగుతుందో అసలు పట్టించుకోలేదు. సరిగ్గా అదే టైంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఉగ్రవాదుల నుండి ప్రాణాలు దక్కించుకునేందుకు పర్యాటకులు పరుగులు తీస్తున్నారు. టెర్రరిస్టుల బుల్లెట్స్ మోత, పర్యాటకులు పరుగులు తీయడం కూడా అందులో రికార్డు అయింది.
గాల్లో వేగంగా రయ్యుమని దూసుకుపోతున్న సదరు టూరిస్ట్ మాత్రం ఇదేం పెద్దగా గమనించలేదు. ఆ టైంలో ఆ కాల్పుల శబ్ధం అతడికి పెద్దగా వినిపించలేదు అయితే ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడునేందుకు పరుగెడుతూనే బుల్లెట్ తగిలి వెనక్కి పడిపోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
Another horrific footage of #PahalgamTerroristAttack.
pic.twitter.com/WBqXRaFTHg — Bharggav Roy![]()
Tags : newslinetelugu attack viral-video terrarist