న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పాకిస్థాన్ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొడుతుంది. ఉగ్రవాదంతో చెలరేగిపోతున్న పాకిస్థాన్ కు సహాయం చేయకూడదంటూ భారత్ ఐంఎంఎఫ్ కు విజ్నప్తి చేసింది. అయినా కూడా ఏమాత్రం పట్టించుకోని ఐఎంఎఫ్ పాకిస్తాన్ 1 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. $7 బిలియన్ల ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) ప్రోగ్రామ్ మొదటి సమీక్షను అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆమోదించింది.
దీని ఫలితంగా పాకిస్థాన్ కు $1 బిలియన్ తక్షణ రుణ వాయిదా లభించింది. పాకిస్తాన్ కు $1.3 బిలియన్ల కొత్త రుణాన్ని అందించింది. దీనితో మొత్తం సహాయం మొత్తం $2.3 బిలియన్ల కు చేరుకుంది. IMF ఈ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో భారతదేశం ఓటింగ్ నుంచి దూరంగా ఉంది. ఉగ్రవాదం పై పాకిస్థాన్ రికార్డు పేలవంగా ఉందని ..ఐఎంఎఫ్ నుండి వచ్చిన నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని భారతదేశం చెబుతోంది. పాకిస్తాన్ మునుపటి IMF కార్యక్రమాల నిబంధనలను పాటించలేదని, దీనివల్ల దాని ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదని భారతదేశం ఆరోపించింది.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ IMF ఆమోదం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. భారతదేశం అభ్యంతరాలను తోసిపుచ్చుతూ , పాకిస్తాన్ ఐఎంఎఫ్ షరతులను పాటిస్తుందని ఆర్ధిక సంస్కరణలకు కట్టుబడి ఉందని అన్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశంతో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో పాకిస్తాన్‌కు ఈ ఆర్థిక సహాయం అందుతోంది. ఈ దాడికి పాకిస్తాన్ కారణమని భారతదేశం ఆరోపించగా, పాకిస్తాన్ ఈ ఆరోపణలను ఖండించింది.