కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌కు సుహాస్ కేరాఫ్‌గా నిలిచాడు. అయితే సుహాస్ లేటెస్ట్ సినిమా జనక అయితే కనక సినిమా ఓటీటీ కి రెడీ అవుతుంది
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సినిమాలకే సెట్ కాని ఫేస్ అన్నారు,...ఇప్పుడు అతనే హిట్ట్ హీరో . బుల్లితెర పై కనిపిస్తే చాలు అనుకున్న స్థాయి నుంచి ..సుహాస్ సినిమా అయితే ఎంత కొంత మ్యాటర్ ఉంటుందనే స్థాయికి చేరుకున్నాడు. చిన్న సినిమాలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌కు సుహాస్ కేరాఫ్‌గా నిలిచాడు. అయితే సుహాస్ లేటెస్ట్ సినిమా జనక అయితే కనక సినిమా ఓటీటీ కి రెడీ అవుతుంది
సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ జనక అయితే గనక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, ప్రభాస్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు నటించిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చారు. దసరా కానుకగా అక్టోబర్ 12న రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు, మంచి మౌత్ టాక్ కారణంగా ప్రేక్షకులు బాగానే ఆదరించారు. దసరా రిలీజ్ సినిమాలు దాదాపు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోయాయి. విశ్వం ఓటీటీ వచ్చేసింది. ఇప్పుడు జనక అయితే గనక కూడా ఓటీటీ రిలీజ్ ముహూర్తం కుదిరింది.
పెళ్లైనా పిల్లల్ని కనకూడదని ప్రసాద్ అంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? మధ్య తరగతి కష్టాలు ప్రసాద్‌పై ఎలాంటి ప్రభావం చూపాయి? కండోమ్ కంపెనీపై ప్రసాద్ ఎందుకు దావా వేశాడు? కోర్టులో టాప్ లాయర్ అజయ్ శర్మ (మురళీ శర్మ) వాదనలను ప్రసాద్ ఎలా ఎదుర్కొన్నాడా? కోటి రూపాయలు పరిహారాన్ని ప్రసాద్ పొందాడా? కండోమ్ వాడినా ప్రసాద్ భార్య ఎందుకు గర్బవతి అయిందనే ప్రశ్నలకు సమాధానమే జనక అయితే గనక సినిమా కథ.
థియేటర్‌లో ఓకే అనిపించుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనక అయితే గనుక ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా నవంబర్ 8వ తేదీ నుంచి ఓటీటీ సంస్థ ఆహా లో అందుబాటులో ఉంటుంది.