ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో సీబీఐ నమోదు చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసినటువంటి అవినీతి కేసులో కేజ్రీవాల్ అరెస్టు
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో సీబీఐ నమోదు చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసినటువంటి అవినీతి కేసులో కేజ్రీవాల్ అరెస్టు అయ్యారు.
ఈ కేసుపై పూర్వపరాలు పరిశీలించినటువంటి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసరం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ పిటిషన్ లపై ధర్మాసరం సెప్టెంబర్ 5వ తేదీన తీర్పు రిజర్వు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.
సమీప భవిష్యత్తులో ట్రయల్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తారన్న సీబీఐ వాదనలను అంగీకరించలేదు. కేజ్రీవాల్ బెయిల్ కు అర్హుడని ధర్మాసనం పేర్కొంది.ఈ కేసుపై ఆయన బయటకు వచ్చి ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, ఈడీ కేసులోని షరతులే ఇక్కడా వర్తిస్తాయని తెలిపింది.
ప్రస్తుతం ఆయనకు బెయిల్ రావడంతో ఢిల్లీ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తం ఐదున్నర నెలల పాటు తీహారు జైల్లో ఉన్నటువంటి సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం బయటకు రావడం ఆమ్ ఆద్మీ శ్రేణులకు ఊరట నిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు.