TELANGANA: ఈ నెల 7న తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఆటోలు బంద్ !

హామీ ఇచ్చినా దీని పై సరైన క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్ ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు.


Published Dec 03, 2024 03:11:00 PM
postImages/2024-12-03/1733218997_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ నెల 7న తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు బంద్ కొనసాగుతున్నట్లు పిలుపిచ్చింది తెలంగాణ ఆటో డ్రైవర్ ఓనర్స్ . రేపు జరగబోయే పెద్దపల్లి సీఎం సభలో ఆటో కార్మికులకు సంవత్సరానికి 12000 రూపాయిలు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి సర్కార్ . అయితే హామీ ఇచ్చినా దీని పై సరైన క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్ ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. సంబరాలు చేసుకుంటున్నారు కాని ఆటో డ్రైవర్ల పరిస్థితిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదని చెబుతున్నారు.  అయితే  రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యంతో 60 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైందని ఆగ్రహించింది తెలంగాణ ఆటో డ్రైవర్ ఓనర్స్. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పితీరాల్సిందేనంటు డిమాండ్ చేశారు.


ఆటో కార్మికుల కొరకు మేనిఫెస్టో లో పెట్టిన సంక్షేమ బోర్డులు సంవత్సరానికి 12000 రూపాయల హామీ ఏమైంది అని ప్రశ్నించింది తెలంగాణ ఆటో డ్రైవర్ ఓనర్స్. మేనిఫెస్టో చైర్మన్గా మంత్రి శ్రీధర్ బాబు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్ల సమస్యలపై ఎందుకు గళం మెత్తడం లేదని… రేపు పెద్దపల్లిలో జరగబోయే సీఎం సభలో ఆటో డ్రైవర్లకు కచ్చితంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది తెలంగాణ ఆటో డ్రైవర్ల ఓనర్స్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu telanganam congress-government strike

Related Articles