ఈ మధ్యలో పెట్టుబడిదారులు బంగారం పై పెట్టుబడి పెట్టి లాభాలు పొందుతున్నారు. బంగారం ధర పెంచుతున్నారు. ఇప్పుడు 10 గ్రాముల బంగారం 96 వేల గా నడుస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా ఆర్ధిక ఉద్రిక్తతలతో పసిడి ధర చుక్కలనంటుంది. అమెరికా , చైనా సుంకాల పోరుతో కొట్టుకుచస్తుంది. ఈ మధ్యలో పెట్టుబడిదారులు బంగారం పై పెట్టుబడి పెట్టి లాభాలు పొందుతున్నారు. బంగారం ధర పెంచుతున్నారు. ఇప్పుడు 10 గ్రాముల బంగారం 96 వేల గా నడుస్తుంది.
నిజానికి ఈ రోజు బంగారం ధర కాస్త తగ్గింది. అయినా పెద్దగా మార్పులు లేనట్టే.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,190, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.95,170 గా ఉంది. అయితే బంగారం ఈ రోజు 100 రూపాయిలు తగ్గినట్లే . అయితే బంగారం లక్షకు దగ్గర గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,190, 24 క్యారెట్ల ధర రూ.95,170గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,190, 24 క్యారెట్ల ధర రూ.95,170 గా ఉంది. వెండి ధర ఆంధ్రాలో రూ.1,09,700. అయితే అన్ని సిటీల్లోను ఇదే ధర కంటిన్యూ అవుతుంది. అయితే మార్కెట్ క్లోజ్ అయ్యే టైం వరకు ధర పెరగడం లేక తగ్గడం రెండు జరగవచ్చు.