ఒకరు సామాజిక అడ్డంకులను అధిగమించేందుకు లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. దీని కోసం వారు సుమారు రూ. 7 లక్షలు ఖర్చు చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ లో ఇద్దరు యువతులు వివాహం చేసుకున్నారు. రాణు, జ్యోతి అనే ఇద్దరు యువతులు ఇలా తాజాగా కన్నౌజ్ లోని సదర్ కొత్వాలిలో వారి ఫ్యామిలీ అనుమతితోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారిలో ఒకరు సామాజిక అడ్డంకులను అధిగమించేందుకు లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. దీని కోసం వారు సుమారు రూ. 7 లక్షలు ఖర్చు చేశారు.
కన్నౌజ్ లోని సదర్ కొత్వాలిలో ఇంద్రగుప్తా అనే వ్యక్తి నగల దుకాణం నడుపుతున్నాడు. అతని కుమార్తె శివాంగి. అయితే, ఒకరోజు ఆ నగల దుకాణానికి జ్యోతి అనే యువతి వచ్చింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ తర్వాత ఇద్దరు క్లోజ్ గా ఉండేవారు. ఇద్దరు కలిసి షాపు అద్దెకు తీసుకొని బ్యూటీపార్లర్ తెరిచారు. అక్కడి నుంచి ప్రేమగా మారడం , చివరికి ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించారు.
అయితే, స్వలింగ వివాహం వల్ల సామాజిక అవమానం తప్పదనుకున్నారు. దాంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. శివాంగికి లింగమార్పిడి ఆపరేషన్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె లక్నో, ఢిల్లీలోని వైద్యులను సంప్రదించి లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకుంది. అనంతరం ఆమె తన పేరును శివంగి నుంచి రాణుగా మార్చుకుంది. వారి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు. కుటుంబంతో ఆశీర్వాదంతో నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు.