1919 మోడల్ సిట్రోయెన్ రోడ్ స్టర్, 1933 మోడల్ క్లాసిక్ కారు కూడా ఆకట్టుకుంది. బికనీర్ , అయోధ్య మహారాజులు వాడిన కారులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడంతో భారీగా జనాలను ఆకట్టుకున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రాజస్థాన్ లోని జయపురలో ఆదివారం 100 ఏళ్ల కాలం నాటి ..వింటేజ్ కార్ల భారీ ర్యాలీ ఆకట్టుకుంది. దేశం నలుమూలల నుంచి 100 కి పైగా అరుదైన చారిత్రక కార్లు ప్రజలను ఆకర్షించాయి. వారసత్వ చిహ్నలైన ఈ క్లాసిక్ కార్లు పింక్ సిటీ గుండా ప్రయాణించినపుడు వాటిని చూసేందుకు ప్రజలు భారీ గా తరలివచ్చాయి. ముంబయి నుంచి గౌతమ్ సింఘానియా పంపిన 1913 ఫోర్డ్ మోడల్ టీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 1919 మోడల్ సిట్రోయెన్ రోడ్ స్టర్, 1933 మోడల్ క్లాసిక్ కారు కూడా ఆకట్టుకుంది. బికనీర్ , అయోధ్య మహారాజులు వాడిన కారులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడంతో భారీగా జనాలను ఆకట్టుకున్నాయి.
వింటేజ్ అండ్ క్లాసిక్ కార్ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ఆటోమొబైల్ వారసత్వాన్ని కాపాడటమేనని రాజ్పుతానా ఆటోమోటివ్ స్పోర్ట్స్ కార్ క్లబ్ ఉపాధ్యక్షుడు సుధీర్ కస్లివాల్ తెలిపారు. వింటేజ్ కార్లను పునరుద్దరించడం వల్ల సాంప్రదాయ మెకానిక్ లకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ర్యాలీ విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి భారీగా జనాలు తరలివచ్చారు. ఈ కార్ల రేస్ ను చాలా అధ్బుతంగా జరిగింది. ఈ అనుభవం నేను జీవితంలో మరిచిపోలేనంటు చెప్పుకొచ్చారు .