ఇతని బట్టతలను రెంట్ కి ఇచ్చి లక్షలు సంపాదిస్తున్నాడు.అది ఎలాగో చూద్దాం.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : " బట్టతల " రెంట్ కి ఎందుకు రా నాయనా ..ఇప్పుడు అందరికి వద్దన్నా...వచ్చేస్తుంది బట్టతల అంటారా ...ఏం చేస్తాం ..పొల్యూషన్ , స్ట్రెస్ , ఫుడ్ , ఇలా ఒక్కటి కాదు అన్ని బట్టతలకు కారణాలే. అయితే బట్టతల ఉన్నందుకు హ్యాపీ గా ఫీలవుతున్న వ్యక్తి ఒకే ఒక్కడు. అది ఇతనే అయ్యింటాడు. ఇతని బట్టతలను రెంట్ కి ఇచ్చి లక్షలు సంపాదిస్తున్నాడు.అది ఎలాగో చూద్దాం.
ప్రతి బ్యూటీ యాడ్స్ కు సపరేట్ బాడీ రెంట్ వాళ్లు ఉంటారు. అంటే నెయిల్ పాలిష్ యాడ్స్ కు నెయిల్స్ ఉన్న అమ్మాయిలు అది నాజుకైన చేయి కలిగి అందమైన నెయిల్స్ ఉన్న వాళ్లు ...కాజల్ యాడ్స్ కు చక్కని కళ్లు ఉన్నవాళ్లు ఇలా ప్రతి బాడీ పార్ట్ కు ఓ వ్యక్తి ఉంటాడు కదా..అలా హెయిర్ గ్రోత్ సీరమ్స్ కు ...హెయిర్ కు సంబంధించిన యాడ్స్ కు బాల్డ్ హెడ్ ను రెంట్ కి ఇస్తుంటాడు ఈ వ్యక్తి .
అతనే షఫీక్ హషీమ్. కేరళలోని ఆళుపుళ జిల్లా కరూర్ నివాసి. కాలేజీ చదువుతున్న రోజుల్లోనే బట్టతలతో ఇబ్బందిపడేవాడట. చిన్న వయసులో బట్టతల చూసి బాధపడేవాడు. ఇప్పుడే ఇదే ..మంచి సంపాదనను తెస్తుందంటున్నాడు.తన బట్టతలను కూడా ఏదో ఒక పనికి ఉపయోగించుకోవాలని ఆలోచన చేశాడట. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలో ఐడియా రాలేదట. బాగా ఆలోచించి ఆలోచించి తన తలను యాడ్స్ ప్రమోషన్ కోసం ఉపయోగించాలని అనుకున్నాడు. అలా అనుకున్నదే తడవుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇక ఆ ఒక్క పోస్ట్‌తో తెగ వైరల్ అయ్యాడు హషీమ్.
చిన్న చిన్న ప్రమోషన్స్ కు వేలల్లో తీసుకుంటాడు. అదే పెద్ద కంపెనీలు అయితే మరీ ఎక్కువ చెల్లించాల్సిందే .ప్రస్తుతం కొచ్చీకి చెందిన ఓ సంస్థకు సంబంధించిన వివరాలను తన తలపైన ప్రింట్ వేయించుకుని ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఒక్కో ప్రకటనకు 50 వేలు తీసుకుంటాడని సమాచారం. ఒక కంపెనీకి సంబంధించిన వివరాలను తలపైన సుమారు మూడు నెలలు ఉంచుకుంటాడట.
ఆ తర్వాత ఆ వివరాలు తీసేసి మరో ప్రకటన కోసం తలను అద్దెకిస్తాడట. అలా అని బట్టతలపై ఫొటోలు తీస్తారనుకుంటారేమో.. అలా కాదు బట్టతల పై బ్రాండ్ పేరు వేయించుకొని మూడు నెలలు ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తాడు కేవలం ఇది మాత్రమే కాకుండా షఫీక్ ఓ యూట్యూబ్ ఛానల్‌ను కూడా నడుపుతున్నాడు. "70ఎమ్‌ఎమ్ వ్లాగ్స్" పేరిట యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ట్రావెల్ వ్లాగ్స్ చేస్తుంటాడు. దాదాపు ముప్ఫై వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు.