ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటీ ప్రకటించారు.
న్యూస్ లైన్ సినిమా: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటీకే టాలీవుడ్ నంచి ఎన్టీఆర్, విశ్వక్ సేన్, సిద్దూ జొన్నల గడ్డ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు వరద సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. ఇక మంగళవారం సాయంత్రం ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటీ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలన చేశారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.