ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. భారతీయ సినీ రంగానికి ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. భారతీరాజా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు ఎన్నో చిరస్మరణీయమైన, అద్భుతమైన చిత్రాలను అందించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. భారతీయ సినీ రంగానికి ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. భారతీరాజా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు ఎన్నో చిరస్మరణీయమైన, అద్భుతమైన చిత్రాలను అందించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.ఆయన మరణం యావత్ భారతీయ సినీ రంగానికి ఎన్నటికీ పూడ్చలేని పెద్ద లోటని తెలిపారు. భారతీరాజా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని తన నివాసంలో భారతీరాజా కన్నుమూశారు. పల్లెటూరి నేపథ్య కథలను సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించి, తమిళ చిత్రసీమను స్టూడియోల నుంచి నిజమైన పల్లెల్లోకి తీసుకెళ్లిన దర్శకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన 'సీతాకోకచిలుక' చిత్రం క్లాసిక్‌గా నిలిచిపోయింది.