Sukumar: సుకుమార్ సినిమా చెయ్యడం మానేస్తారట !

'గేమ్ చేంజ‌ర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డ‌ల్లాస్ లో ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మూవీకి చీఫ్ గెస్ట్ గా సుకుమార్ వెళ్లారు. అక్కడే ఈ విషయాన్ని తెలిపారు. 


Published Dec 24, 2024 07:58:00 PM
postImages/2024-12-24/1735050554_BoxofficenumbersforPushpaareoverwhelmingsaysdirectorSukumar.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  టాలీవుడ్ టాలెంటెడ్ డైరక్టర్ సుకుమారు ఛాన్స్ ఉంటే సినిమా  మానేస్తానంటూ చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'గేమ్ చేంజ‌ర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డ‌ల్లాస్ లో ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మూవీకి చీఫ్ గెస్ట్ గా సుకుమార్ వెళ్లారు. అక్కడే ఈ విషయాన్ని తెలిపారు. 


ఈ ఈవెంట్ లో లెక్క‌ల మాస్టారు సుక్కును 'దోప్' అనే ప‌దంతో ఒక‌టి వ‌దిలేయాలంటే మీరు ఏం వ‌దిలేస్తారు? అని క్వశ్చన్ వేస్తే సుకుమార్ ఆలోచించకుండా సినిమాలు తియ్యడం మానేస్తానంటూ చెప్పుకొచ్చారు. దీనికి వెంటనే రామ్ చరణ్ మైక్ లాక్కొని చాలా యేళ్లుగా ఇదే చెప్తున్నారు. కాని సుకుమార్ ఆ పని అస్సలు చెయ్యలేరంటూ చెప్పాడు. ప్రజెంట్ ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.


సంక్రాంతి కానుకగా  జనవరి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. చెర్రీ స‌ర‌స‌న బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌మ‌న్ బాణీలు అందిస్తున్న ఈ మూవీని... శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమిళ్ డైరక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీ కి కథ అందించారు. ఎస్ జే సూర్య, శ్రీకాంత్ , అంజలి లాంటి భారీ తారాగనం ఉన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sukumar shankar game-changer

Related Articles