ప్రస్తుత కాలంలో చాలామంది డబ్బు సంపాదిస్తున్నారు. వారు ఎంత సంపాదించిన డబ్బు ఇంట్లోకి వచ్చినా తర్వాత ఒక్క రూపాయి మిగలక, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఎదుర్కొంటు ఉంటారు. అలాంటివారు
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది డబ్బు సంపాదిస్తున్నారు. వారు ఎంత సంపాదించిన డబ్బు ఇంట్లోకి వచ్చినా తర్వాత ఒక్క రూపాయి మిగలక, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఎదుర్కొంటు ఉంటారు. అలాంటివారు డబ్బులు కాస్త పోగు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ పరిహారాలు చేయాల్సిందే. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తీరిపోయి డబ్బులు కూడా దురమవుతాయట. మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకు ఆర్థిక కష్టాలు పోయి డబ్బు పోగావ్వలి అంటే పచ్చ కర్పూరంతో ఇలా చేయాల్సిందే. పచ్చ కర్పూరం అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది.
లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందిస్తుంది పచ్చ కర్పూరాన్ని కేవలం పూజలు చేసే సమయంలో మాత్రమే ఉపయోగించడం కాకుండా ఇంట్లో ఏ ప్రదేశాల్లో పచ్చకర్పూరాన్ని పెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం మంగళవారం లేదా శుక్రవారం రోజున ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ప్రాంతంలో మాత్రమే చేయాలి లేదంటే సాయంత్రం 6 నుంచి 10 గంటల లోపు చేయడం వల్ల రెట్టింపు ఫలితాలు ఉంటాయని అంటున్నారు.
మీరు మీ బీరువాలే దాచుకునే డబ్బుల నుంచి ఏదైనా ఒక నోటును తీసుకొని ఆ నోటు మీద ఈ పచ్చ కర్పూరం పొడిని తీసుకెళ్లి వేయండి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా వంట గదిలో ఉండే ఉప్పు జాడిలోంచి కాస్త ఉప్పు గిన్నెలో వేసుకున్న తర్వాత ఆ ఉప్పు మీద ఈ పచ్చ కర్పూరాన్ని పొడి చేసి రెండింటిని కలిపి వేయండి. ఆ తర్వాత దీన్ని గ్యాస్ స్టవ్ కుడి పక్కన ఒక మూలన మూత పెట్టకుండా ఉంచండి. ఎన్ని రోజులైనా ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. దీంతో మీకు అనేక లాభాలు ఉంటాయట.
అంతేకాకుండా శుక్రవారం, మంగళవారం మన ఇంటి గుమ్మానికి పసుపు రాస్తూ ఉంటాం. అయితే ఆ పసుపులో కాస్త పచ్చ కర్పూరం పొడి పన్నీర్ తో పేస్టులా కలుపుకొని ఇంటి గుమ్మానికి రాసి, బొట్లు పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందట. మీరు ఒక పూజ గదిలో చిల్లర కాయిన్స్ తీసుకొని ఒక గిన్నెలో వేసి పచ్చ కర్పూరం పొడి లా చేసి ఆ కాయిన్స్ మీద వేయండి. ఇలా చేయడం వల్ల ఇల్లు సువాసన భరితంగా మారుతుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువుదీరి ఉంటుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు కట్టలు కట్టలుగా వస్తుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు.