ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భవతికి సంబంధించిన న్యూసే వస్తోంది. శాంతి ప్రెగ్నెంట్ అవ్వడం తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని శాంతి భర్త మదన్మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అంతే కాకుండా తన భార్య గర్భానికి ప్రధాన కారకుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణం అంటూ కొన్ని ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి. దీనిపై విపరీతమైనటువంటి రచ్చ జరుగుతోంది.
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భవతికి సంబంధించిన న్యూసే వస్తోంది. శాంతి ప్రెగ్నెంట్ అవ్వడం తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని శాంతి భర్త మదన్మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అంతే కాకుండా తన భార్య గర్భానికి ప్రధాన కారకుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణం అంటూ కొన్ని ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి. దీనిపై విపరీతమైనటువంటి రచ్చ జరుగుతోంది.
ఇదే తరుణంలో శాంతి మీడియా ముందుకు వచ్చి గర్భానికి కారకులు ఎవరో? తన జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియజేసింది. నాకు మదన్మోహన్ కు 2013లో వివాహం జరిగిందని, అది కూడా నేను లాయర్ గా చదువుతున్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారని అన్నది. కానీ మదన్మోహన్ నన్ను పెళ్లి తర్వాత చాలా హింసించాడని దీంతో మేము 2016 లోనే డైవర్స్ తీసుకొని వేరువేరుగా ఉంటున్నామని చెప్పింది.
మా ఆస్తులు, పిల్లల విషయంలో కూడా ఒప్పందం రాసుకున్నామని , అయితే విడాకుల తర్వాత నేను సుభాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నానని తెలియజేసింది. నేను మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కానీ మదన్మోహన్ నన్ను వేధిస్తూ వస్తున్నాడని అన్నది. ఆయన డబ్బు కోసం ఇలా చేస్తున్నాడని నేను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని కాబట్టి నన్ను ఇలా టార్గెట్ చేశారని అన్నది.. వేరే కులానికి చెందిన అమ్మాయి అయితే ఈ విధంగా టార్గెట్ చేయగలరా.? నేను మంచి బట్టలు నగలు ధరించకూడదా? నేను కష్టపడి న్యాయవాద, వృత్తి కంప్లీట్ చేస్తానని అడ్వకేట్ గా కూడా ప్రాక్టీస్ చేశాను.
నా కాళ్ళ మీద నేను బ్రతకాలను అని అన్నది. నన్ను ఈ విధంగా రోడ్డుపైకి లాగి ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని తెలియజేసింది. నా వయసు 35 సాయిరెడ్డి వయసు 68 నాకు ఆయనకు సంబంధం కలపడం మంచి పద్ధతి కాదని అన్నది. సాయిరెడ్డి అనే వ్యక్తి చాలా గౌరవప్రదమైన వ్యక్తి అని ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నా గర్భానికి కారణం నా రెండవ భర్త అంటూ స్పష్టం చేసింది. ఇదే విషయంపై తాజాగా విజయ సాయిరెడ్డి స్పందించారు.
కొంతమంది వ్యక్తులు కుట్రపూరితంగా నాపై ఆరోపణలు చేస్తున్నారని, ఒక ఆదివాసి బిడ్డను బజారులో నిలబెట్టారని, ఎంపీ అయినప్పుడు నన్ను ఎంతో మంది ఆఫీసర్లు కరుస్తారని, అంతమాత్రాన సంబంధాలు అంటగడతారా తారతమ్యాలు అనేవి ఉండవా? అంటూ చెప్పుకొచ్చాడు. మీడియా ముందుకు వచ్చి తండ్రి లాంటి వ్యక్తి అని చెప్పుకొచ్చింది. మీకు ఏమీ అనిపించడం లేదా ఇలాంటి తప్పుడు వార్తలు క్రియేట్ చేయడానికి మనసెలా ఒప్పింది అంటూ కడిగిపారేశారు. త్వరలోనే దీనిపై జాతీయస్థాయిలో మానవ హక్కుల సంఘానికి ట్రైబల్ వెల్ఫేర్ సంఘానికి, మీడియా సంఘాలకు ఫిర్యాదు చేస్తానని అన్నాడు.