Redmi 135G:కళ్ళు చెదిరే లుక్ లో..108ఎంపీ కెమెరా అద్భుత ఫీచర్స్..!

Published 2024-07-04 20:12:58

postImages/2024-07-04/1720104178_redmi.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రపంచ మార్కెట్ లో అత్యంత ఆదరణ పొందినటువంటి మొబైల్ ఫోన్ కంపెనీలలో రెడ్మి కూడా ఒకటి. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల వేరియంట్లు బయటకు వచ్చి మంచి ఆదరణ పొందాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెడ్మీ 13 5g జూలై 9వ తేదీన విడుదల అవ్వడానికి సిద్ధమయింది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ ఇతర వివరాలు లీక్ అయ్యాయి. మరి ఫోన్ యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రెడ్మీ 13,5g ముందు భాగంలో గొరిల్లా గ్లాస్ మరియు వెనుక భాగంలో పటిష్టమైన గ్లాసు మధ్యలో ప్లాస్టిక్ ఫ్రేమ్ తో అద్భుతమైన లుక్ లో కనిపిస్తుంది. Xiaomi ఫోన్ ఆర్చిడ్ పింక్,  హవాయి బ్లూ మరియు బ్లాక్ డైమండ్ లో రవాణా చేస్తుంది. అంతేకాకుండా ఫోన్ ముందు భాగంలో 6.79 అంగుళాల FHD+ 120Hz డిస్ప్లేను కలిగి ఉంటుంది.  అలాగే ఈ మొబైల్ బ్యాటరీ విషయానికొస్తే 5030mAh బ్యాటరీ తో 33W చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం గంటసేపట్లో పూర్తిస్థాయి చార్జింగ్ అవుతుంది.

అలాగే ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ ఫోర్త్ జనరేషన్ 2ఏఈ ఉపయోగిస్తుంది. ఇక ఈ మొబైల్ స్టోరేజ్ విషయానికొస్తే  6జీబీ లేదా 8gb ర్యామ్  మరియు యుఎఫ్ఎస్  2.2 స్టోరేజ్ కలిగి 128gb స్టోరేజ్ ఎంపిక చేస్తోంది. రెడ్మీ 13, 5g హైపర్ ఓఎస్ తో కూడిన  మొదటి రెడ్మీ అని నివేదించబడింది. ఇక ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 3x 5g 3x ఇన్ సెన్సార్ జూమ్ తో  సాంసంగ్  HM6, 108mp ప్రధాన కెమెరా కలిగి ఉంది. అలాగే 2 ఎంపీ మాక్రో కెమెరా ముందు భాగంలో 13 ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.