గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆయన అన్నారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం సర్వత్రా చర్చినీయాంశమైన హైడ్రా అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆయన అన్నారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు.
అక్రమ నిర్మాణాలకు రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయం ఎలా కల్పించారు.? అని కిషన్ రెడ్డి నిలదీశారు. గతంలో అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలపై సమగ్ర చర్చ జరగాలని అన్నారు. ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలని సూచించారు.