ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లా చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఓ వివాహితకు ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏం సోషల్ మీడియా ...మంచి కంటే చెడే ఎక్కువ అలా అని ...ఈ ముచ్చట మొదటిదా అంటే కాదు...వేలు లక్షల్లో చూస్తున్నారు ..వింటున్నారు. పోనీ బయట ప్రపంచం తెలియని అమాయకులు అందుకే ఇలా ఇరుక్కొని ప్రాణం తీసుకున్నారు అనుకోవడానికి లేదు. ప్రాణానికి విలువ లేదు. ఇప్పుడు అంతా డబ్బే. ఈ విషయం చంటిపిల్లలకు కూడా అర్ధమవుతుంది. మన చావుకు అర్ధముండాలి. ధైర్యంగా నిలబడాలి. అతుకుల బొంతలా అల్లుకు పోయే అబధ్దాలతో ...సాలీడు గూడు లాంటి జీవితం గడిపితే ...మన అబద్దాలకు మనమే బలవుతాం. ఇప్పుడు పరిస్థితులు అలానే ఉన్నాయి కూడా.
సోషల్ మీడియా పరిచయం ఓ వివాహిత ప్రాణం తీసింది. తన చావుకు అయ్యో పాపం అనాలా లేక తెలివి లేని పని చేసిందని అనుకోవాలా.. ఏంటో దేవుడికే తెలియాలి. ఏపీ లోని తూర్పు గోదావరి జిల్లా చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఓ వివాహితకు ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫ్రెండ్ పరిచయం అయ్యాడు.వాడి మాయమాటలు నమ్మింది. ప్రేమించిందో ...మరి తన మీద ఆశపడిందో ఏం జరిగిందో తన నగలు అన్నీ తీసుకెళ్లి ఆ కేటుగాడు చేతిలో పెట్టింది. బంగారం ఏదని అడిగితే ...అత్తిరింటి వారికి ఏం చెప్పాలో తెలీక...పుట్టింటికి వెళ్లి ఉరివేసుకొని చనిపోయింది. ఏం జరిగిందో తెలీక ..మృతిరాలి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా అసలు విషయం బయటపడింది. మృతురాలికి ఓ చంటిపాప ఉంది. ఎవ్వరి కోసం ఆలోచనలేదు. తన చావుకు అర్ధం కూడా లేకుండా చేసుకుంది.