మహేష్ బాబు లాగే నాగమణికంఠ..షాకింగ్ కామెంట్స్ చేసిన గీతు రాయల్.!

బిగ్ బాస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న షో. ఇప్పటికే ఏడు సీజన్స్ పూర్తిచేసుకుని ఎనిమిదో సీజన్ కూడా మొదలైంది. ఈ సీజన్ లో 14 మంది కంటెస్టెంట్లు  అడుగు పెట్టారు. ఈ


Published Sep 07, 2024 02:14:17 PM
postImages/2024-09-07/1725698657_geethu.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న షో. ఇప్పటికే ఏడు సీజన్స్ పూర్తిచేసుకుని ఎనిమిదో సీజన్ కూడా మొదలైంది. ఈ సీజన్ లో 14 మంది కంటెస్టెంట్లు  అడుగు పెట్టారు. ఈ కంటెస్టెంట్లు వచ్చి కూడా  ఇప్పటికే ఆరు రోజులు గడుస్తోంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య మూడు గొడవలు, ఆరు కొట్లాటలుగా నడుస్తోంది. అయితే బిగ్ బాస్ ఈ షోను స్పెషల్ గా చూపిస్తారని తెలుస్తోంది.  ప్రతి టాస్క్ వెనుక ఏదో రహస్యం దాగి ఉంటుందని చెబుతూ వస్తున్నారు.  అంతేకాకుండా వచ్చిన మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు  వారి తెలివి చూపిస్తూ ఉండటం మొదలుపెట్టారు.

ఎలిమినేషన్ టైంలో ఒకరినొకరు విమర్శిస్తూ హైలెట్ అవుతున్నారు.  మీరందరిలో కెల్లా చాలా స్పెషల్ గా కనిపించింది మాత్రం నాగ మణికంఠ అని చెప్పవచ్చు.  ఈయన తరచూ ఎమోషనల్ అవుతూ తన తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి చెబుతూ వచ్చారు..  దీంతో హౌస్ లో ఉండే వారంతా విమర్శించడంతో ఆయనకు ఎలిమినేషన్ లో ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో నాగ మణికంఠ  విపరీతంగా ఏడుస్తూ నెత్తిపై ఉండే చిన్న విగ్గును తీసేసి పక్కన పడేశారు. నేను ఇప్పటినుంచి ట్రాన్స్పరెంట్ గా ఉంటానని చెప్పుకొచ్చారు.  ఇదే విషయమై నాగ మణికంఠకు సపోర్ట్ చేస్తూ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ ఒక వీడియోను  రిలీజ్ చేసింది. అయితే నాగమణికంఠ మానసికంగా  సరిగ్గా లేడు, చాలామంది రివ్యూ వర్లు ఆయన విగ్గు తీసి పక్కన పెట్టడంతో వెటకారంగా మాట్లాడుతున్నారు. కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు  ఇండస్ట్రీలో ఉండే సమయంలో టీవీలో అందంగా కనిపించడం కోసం చాలామంది ఇలాగే చేస్తారు.

https://www.instagram.com/reel/C_iKg9gPPy3/?igsh=MXd2NmJsNHc3b3I5cw==

తనకు కాస్త హెయిర్ లేకపోవడంతో విగ్గు పెట్టుకున్నాడు, అది తప్పు కాదు కదా అంటూ చెప్పుకొచ్చింది. ఇలా చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హెయిర్ ఉండదు. కానీ ఆయన ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. ఎవరైనా సరే ఇండస్ట్రీలో అందంగా కనిపించాలి అనుకుంటారు కానీ, అందవిహీనంగా కనిపించాలి అనుకోరు. మణికంఠ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు కాబట్టి విగ్గు మెయింటైన్ చేస్తున్నాడు.

దానికి కూడా మీరు కామెంట్లు చేసి హేళన చేస్తే మాత్రం మానవత్వం లేనట్లే అంటూ చెప్పుకొచ్చింది. ఈ విధంగా నాగమణికంఠను మహేష్ బాబును పోల్చి చెప్పడంతో  సూపర్ స్టార్ అభిమానులంతా  గీతూ రాయల్ పై  మండిపడుతున్నారు. మహేష్ బాబు ఎక్కడ నాగమణికంఠ ఎక్కడ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line nagarjuna mahesh-babu big-boos8 geethu-rayal naga-manikanta

Related Articles