RAILWAY JOBS: రైల్వేలో 3445 క్లర్క్ జాబ్స్.. చివరి తేదీ ఇదే !

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ రిక్రూట్‌మెంట్‌ 2024 ద్వారా 3445 క్లర్క్ జాబ్స్ న భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్.


Published Sep 22, 2024 12:04:00 PM
postImages/2024-09-22/1726986931_04022024rrb1a.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న చాలా మంది నిరుద్యోగులకు ఇది సువర్ణఅవకాశమనే చెప్పాలి. రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి వేల సంఖ్యలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది . ఏకంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగం కొట్టే ఛాన్స్ దొరికింది. కాస్త కష్టపడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది.ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ రిక్రూట్‌మెంట్‌ 2024 ద్వారా 3445 క్లర్క్ జాబ్స్ న భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్.


కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు 2022, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 990, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు 72 భర్తీ కానున్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్‌ పాసై ఉండాలి. అంతేకాదు అభ్యర్ధుల వయసు కూడా 18నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. సీబీటీ టెస్ట్ , స్కిల్ టెస్ట్ , మెడికల్ టెస్ట్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాంటి డీటైల్స్ ను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు అక్టోబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు.


మొత్తం పోస్టుల సంఖ్య : 3445


కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు : 2022


అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు : 361


జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు : 990


ట్రైన్స్ క్లర్క్ పోస్టులు : 72


అర్హతలు :


దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్‌/12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కేటగిరీ అభ్యర్థులకు రూ.250. మిగతా అన్ని అప్లికేషన్లకు 500 రూపాయిలు . అయితే మీరు సీబీటీ పరిక్ష రాస్తున్నపుడు ఈ డబ్బును రిటర్న్ చేస్తారు.


కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు : రూ. 21700


అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు : రూ. 19900


జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు : రూ. 19900
ట్రైన్స్ క్లర్క్ పోస్టులు : రూ. 19900


దరఖాస్తు ప్రారంభ తేదీ:


21-09-2024
దరఖాస్తుకు చివరి తేదీ:
20-10-2024

newsline-whatsapp-channel
Tags : newslinetelugu railway-department jobs govt-jobs

Related Articles