operation sindhoor: ఆపరేషన్ సిందూర్ లో భారత్ కు జరిగిన లాభం ఏంటి!

భారతీయ పౌరులను 26 మందిని మత వివక్షపేరుతో పెహల్గామ్ లో 26 మందిని టెర్రరిస్ట్ లు చంపేశారు.  దీనికి ప్రతీకారంగా  ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ అయ్యింది.


Published May 15, 2025 08:40:00 PM
postImages/2025-05-15/1747321876_Sindoor.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆపరేషన్ సిందూర్ ..ప్రతి భారతీయునికి మరోసారి దేశభక్తిని రేకెత్తించింది. మన దేశసైనికుల త్యాగాలను గుర్తించేలా చేసింది. మోదీ సత్తా ప్రపంచదేశాలకు అర్ధమయ్యేలా చేసింది. ఇదంతా సరే ..కాని భారత్ కు ఆర్ధికంగా , ఎకనామికల్ గా , ఏం లబ్ధిపొందింది. ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ కు లాభమా ...భారత్ కు లాభమా. తెలుసుకుందాం.


భారతీయ పౌరులను 26 మందిని మత వివక్షపేరుతో పెహల్గామ్ లో 26 మందిని టెర్రరిస్ట్ లు చంపేశారు.  దీనికి ప్రతీకారంగా  ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ అయ్యింది. యుద్దమే మొదలైనంత పనిచేసింది భారతదేశం ఈ సారి పాకిస్థాన్ ను ఆక్రమించుకోవడం ఖాయమనుకున్నారంతా. ఆల్ మోస్ట్ విజయం మనదే పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చిందనుకుంటున్న టైంలో అమెరికా వేలుపెట్టి ..డీల్ చేసింది. దీని వల్ల భారత్ కు వచ్చేది ఏం లేదు కాని ..పాకిస్థాన్ కు మాత్రం లాభమే. ఆల్ మోస్ట్ చావు అంచుల వరకు వెళ్లి బయటకు వచ్చింది. అయితే భారత్ కు ఈ ఆపరేషన్ సిందూర్ వల్ల ఏం ఒరిగిందని ప్రజలు ..కాంగ్రెస్ పార్టీ పెద్దలు చాలా మంది కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. నిజానికి భారత్ కు ఆపరేషన్ సిందూర్ లాభాన్నే చేకూర్చింది.


* భారతదేశం తన ప్రజలను రక్షించుకోవడానికి అనుమతి కోసం వేచి ఉండదని ప్రపంచానికి చూపించింది. ఉగ్రవాదం ఎప్పుడైనా, ఎక్కడైనా శిక్షించబడుతుంది. ఉగ్రవాదులకు చోటు ఇచ్చే దేశాలేంటో ప్రపంచ దేశాలన్నింటి ముందు పాకిస్థాన్ ను బట్టలిప్పి నించోబెట్టింది.


* సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళం సమన్వయంతో దాడులు ప్రారంభించాయి - పెరుగుతున్న ఉమ్మడి యుద్ధ సామర్థ్యానికి మన దేశ సైనిక బలాన్ని అన్ని దేశాలకు చూపించింది.


* పాకిస్తాన్ మరియు పీవోజేకే అంతటా తొమ్మిది అధిక విలువ కలిగిన ఉగ్రవాద స్థావరాలను భారతదేశం ధ్వంసం చేసింది. ఇది పాకిస్థాన్ కు చాలా పెద్ద నష్టం. పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడు అసలు బాలేదు. ఇలాంటి టైంలో చిన్న నష్టం కూడా పాక్ కు భారీ నష్టమే. ఇప్పుడు భారత్ చేసిన నష్టం పూడ్చడానికి పాకిస్థాన్ కు మరో 20 యేళ్లు పడుతుంది. 


* లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM), మరియు హిజ్బుల్ ముజాహిదీన్ లకు చెందిన లక్ష్యాలు ఈ ప్రదేశాలు. భారతదేశంపై దాడులకు ప్రణాళికలు వేయడానికి కీలకమైన శిక్షణ మరియు కార్యాచరణ కేంద్రాలుగా ఈ ప్రదేశాలను గుర్తించారు.


* ఉగ్రవాదులు వేరు, ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారు వేరు అనే భావనను భారతదేశం తుడిచిపెట్టింది. ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే వారు కూడా ఉగ్రవాదులే . ఈ విషయాన్ని క్లియర్ గా తెలియజేసింది. 


* పాకిస్తాన్ లోపల వందల కిలోమీటర్లు దాడులు జరిగాయి, పీవోకే మాత్రమే కాదు. పాకిస్తాన్ సైన్యం యొక్క వ్యూహాత్మక బలమైన కోటగా పరిగణించబడే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని లక్ష్యాలను కూడా భారతదేశం ఛేదించింది.


* అమెరికా కూడా తన డ్రోన్లను పంపడానికి ధైర్యం చేయని బహవల్పూర్ వంటి సున్నితమైన ఉగ్రవాద కేంద్రాలపై భారతదేశం దాడులు చేసింది. ఇది నాశనం చేయడం భారత్ కు విక్టరీ. ఇది భారత్ పాకిస్థాన్ కు చేసిన క్లియర్ సవాల్ . పాకిస్థాన్ లో భారత్ చేరుకోలేని స్థలం లేదని తెలిపింది.


* భారత్ లో ఉన్న ఇతర దేశాల పౌరులను ఏరిపారేస్తుంది. ఈ ప్రాసెస్ ఇంకా జరుగుతుంది. 


* SCALP క్షిపణులు మరియు HAMMER బాంబులతో కూడిన భారతీయ రాఫెల్ జెట్ లు ఏవీ భారత్ నష్టపోలేదు. కాని పాకిస్థాన్ కోట్ల ఆస్తినష్టాన్ని మూటగట్టుకుంది. 


* భారతదేశం తన జీరో-టాలరెన్స్ సిద్ధాంతాన్ని అనుసరించింది. ప్రజలను ఎట్టిపరిస్థితుల్లో టార్గెట్ చెయ్యలేదు. ఫస్ట్ టెర్రరిస్ట్ లే. పాకిస్తాన్ వారిని ప్రజలుగా చిత్రీకరించింది.


* భారతదేశ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులతో సహా అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. బహుళ ఉగ్రవాద మాడ్యూళ్ల నాయకత్వం ఒకే రాత్రిలో తుడిచిపెట్టుకుపోయింది.


*"రక్తం, నీరు రెండూ ఏకకాలంలో ప్రవహించలేవు" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోనే తేల్చిచెప్పారు.  సిందూ జలాల ఒప్పందాన్ని చాలా తెలివిగా తప్పించారు. ఇది ఇప్పటికి ప్రజలకు అర్దంకాకపోయినా భవిష్యత్తులో భారతీయులకు ఇది ఎంత మంచి నిర్ణయమో తెలుస్తుంది, 


* పాకిస్తాన్ వైమానిక దళం (PAF) యొక్క 20 శాతం మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. భారతదేశం పాకిస్తాన్‌లోని భోలారి వైమానిక స్థావరంపై బాంబు దాడి చేసింది. వైమానిక సిబ్బందితో సహా 50 మందికి పైగా మరణించారు. చాలా యుధ్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి.


* ఎప్పుడు శాంతిమంత్రమే  కాదు భారత్ తిరగబడితే ఎలా ఉంటుందో చూపించింది. ఒక్క రోజులో పాకిస్తాన్ ను మట్టికరిపిస్తుందనే విషయం అర్ధమయ్యేలా చేసింది. 


ఎప్పుడు యుధ్ధం ఆఖరి అవకాశం అవ్వాలి. భారత్ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. ఇలాంటి టైంలో భారత్ యుధ్దానికి మొండిగా వెళ్తే ..ఆస్థి నష్టాన్ని , ప్రాణ నష్టాన్ని చవిచూడాలి. అది ఇలాంటి టైంలో భారత్ కు అవసరం లేదు. అంతేకాదు భారత్ ఎప్పుడు ఫస్ట్ ఆప్షన్ గా శాంతే కోరుతుంది. ఈ ఆపరేషన్ సిందూర్ లో మొదట తిరిగబడినా ...చివరికి ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఒప్పందానికి ఒప్పుకుంది. దీని వల్ల భారత్ కు లాభమే కాని నష్టం కాదు.
 

newsline-whatsapp-channel
Tags : america india pakistan operation-sindhoor

Related Articles