అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం శనివారం ఉదయం ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆయన మరణంపై సీఎం చంద్రబాబు నాయుడు రీసెంట్ గా ట్వీట్ చేశారు. భారతదేశం రెండు అణు పరీక్షలు నిర్వహించిందని, ఆ సమయంలో శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం చేసిన సేవలు మర్చిపోలేనివని సీఎం చంద్రబాబు అన్నారు. అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం శనివారం ఉదయం ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
అయితే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందిస్తూ రాజగోపాలం చిదంబరం కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 1975,1998 లో దేశంలో నిర్వహించిన రెండు అణు పరీక్షల్లో రాజగోపాల చిదంబరం కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. ఈ ప్రయోగానికి చిదంబరం నాయకత్వం వహించారు. ఆయుధ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం గారి మరణం విచారకరమని తెలిపారు చంద్రబాబు.