TTD: టీటీడీలో జరిగిన అక్రమాలను సీఎం దృష్టికి తీసుకెళతాం: భానుప్రకాశ్ రెడ్డి

టీటీడీ లో అక్రమాలు చేసిన వారిని తప్పించే ప్రయత్నాలు చేశారని అక్రమార్కులతో రాజీ చేసుకొని కేసులు పెట్టకుండా వదిలేశారని ఆరోపించారు.


Published Dec 31, 2024 04:47:00 PM
postImages/2024-12-31/1735643927_bhanuprakashreddy3be0abdebcvjpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఏపీ బీజేపీ నేత , టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి నేడు మీడియా తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టీటీడీ దేవస్థానాలను వైసీపీ ఎస్టీట్లుగా మార్చారని మండిపడ్డారు. టీటీడీ లో అక్రమాలు చేసిన వారిని తప్పించే ప్రయత్నాలు చేశారని అక్రమార్కులతో రాజీ చేసుకొని కేసులు పెట్టకుండా వదిలేశారని ఆరోపించారు.


వైసీపీ హయాంలో టీటీడీలో భారీ ఎత్తున దోపిడీ జరిగిందని, భక్తులు ఇచ్చిన విరాళాలను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని తెలిపారు.అంతేకాదు ప్రభుత్వానికి టీటీడీ లో జరిగిన అన్ని విషయాలను బయటపెడతానని తెలిపారు.


టీటీడీలో విజిలెన్స్ అధికారిగా పనిచేసిన శివశంకర్ అక్రమాలు చేశారు. అక్రమాలకు పాల్పడిన శివకుమార్ పై చర్యలు తీసుకోలేదు... శివశంకర్ పై ఎలాంటి కేసు పెట్టలేదు. అంతేకాదు శివశంకర్ డిప్యుటేషన్ రద్దు చేసి సొంత శాఖకు పంపించారు. పరకామణి చోరీ కేసు నిందితున్ని కూడా తప్పించారు. రవికుమార్ తప్పించడంలో శివ శంకర్ కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వం హయాంలో టీటీడీలో జరిగిన అన్ని అక్రమాలను ముఖ్యమంత్రికి వివరిస్తాం అని భాను ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ycp ttd tirumala

Related Articles