ఇప్పుడు ఉన్న ఖైదీలలో శిక్ష ఖరారైన వారి సంఖ్య 440 మాత్రమేనని, మిగతా వారంతా రిమాండ్ ఖైదీలేనని తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: విశాఖ జైలు ఖైదీలతో కిక్కిరిసిపోతుంది. 950 మంది ఉండాల్సిన సామర్ధ్యం ఉన్న జైలులో ప్రస్తుతం 2,076 మంది ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు. జైలు సామర్ధ్యానికి మించి ఖైదీలు ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఖైదీలలో శిక్ష ఖరారైన వారి సంఖ్య 440 మాత్రమేనని, మిగతా వారంతా రిమాండ్ ఖైదీలేనని తెలిపారు.
రాష్ట్రంలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపడం, తనిఖీలు పెంచడంతో పెద్ద సంఖ్యలో నిందితులు పట్టుబడుతున్నారు. జైలులో మొత్తం బ్యారక్ లు ఉండగా అందులో 950 మంది ఖైదీలను ఉంచే వీలుంది ప్రస్తుతం ఈ జైలులో 2,076 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 1,145 మంది గంజాయి కేసుల్లో పట్టుబడి రిమాండ్ ఖైదీలుగా వచ్చిన వారేనని అధికారులు తెలిపారు. మిగతా వారిలో 440 మంది ఖైదీలకు శిక్ష ఖరారైందని చెప్పారు. క్షమాబిక్ష మీద విడుదలయ్యే వారు 40 మందే ఉన్నారు. సిబ్బంది తక్కువగానే ఉన్నారు.
విశాఖ జైలులో మరో భవన నిర్మాణానికి రూ.26 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర హోంశాఖ అంగీకరించింది. అదే విధంగా ఓపెన్ జైలు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో మరో 250 మంది ఖైదీలను ఉంచేందుకు ఏర్పాట్లు చేయవచ్చని అధికారులు తెలిపారు.భద్రతా ఏర్పాట్ల కోసం ఏపీ ప్రభుత్వం మరో రూ.75 లక్షలు కేటాయించినట్లు వివరించారు.