2014, 2019 ,2024 వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుంటున్న కమలం పార్టీ అందించిన అవకాశాలను అనుకూలంగా మార్చుకుంటోంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలంగాణ లో బీజేపీ స్ట్రాంగ్ గా నే ఉంది. కాని ఏపీలో కాదు అందుకే ఏపీ లో కూడా బీజేపీ స్ట్రాంగ గా డిసైజ్ అయ్యింది. అందుకే బేస్ లెవెల్ లో తన పునాదులను వేస్తుంది బీజేపీ . ప్రభుత్వంలో ఉంటూనే.. స్వంతంగా ఎదరగాలని వ్యూహ రచన చేస్తోంది. జనసేన మధ్ధతుతో బీజేపీ పునాదులు పడడానికి పావులు కదుపుతుంది. 2014, 2019 ,2024 వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుంటున్న కమలం పార్టీ అందించిన అవకాశాలను అనుకూలంగా మార్చుకుంటోంది.
ఏపీలో పార్టీ బలోపేతంపై జాతీయ నాయకత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఆ దిశగా రాష్ట్ర పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిందట. కేంద్రప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళలాలని ఎప్పటికప్పుడు జిల్లా, రాష్ట నాయకత్వ సూచనలను అమలు చెయ్యాలని నేతలకు గట్తిగానే చెప్పిందట. లాస్ట్ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాలతో పాటు ..రెండో స్థానానికి పరిమితమైన నియోజకవర్గాల జాబితాను సిధ్దం చేసి జాతీయ నాయకత్వానికి పంపారట. ఏపీ ప్రజలకు బీజేపీ నుంచి ఏంకావాలనేది తెలుసుకోవాలనేదే బీజేపీ ముఖ్య ఉద్దేశ్యం.
రెండేళ్లలో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా బిజేపీని మార్చేలా నేతలు కష్టపడి పనిచెయ్యాలని కమలం అగ్రనేతలు ఆదేశించారని పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేనతో మరింత బంధం పెంచుకొని దశల వారీగా బలం పుంజుకునేలా ప్లాన్ చేస్తుంది. తెలంగాణలో పట్టు సాధించినట్టే ఏపీ లో కూడా పట్టు పెంచుకోవాలని జాతీయ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. వారి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.