ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈవెంట్ల నిర్వహణ స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం ఆగమనం చేస్తుంది. విశాఖనగర పోలీసుకమిషనర్ శంఖబ్రత బాగ్చి కొన్ని రూల్స్ ను తెలిారు. న్యూయర్ సంధర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లు , పబ్ లు , క్లబ్ లు డిసెంబరు 31న హోటళ్లు, క్లబ్ లు, పబ్ ల నిర్వహణకు రాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈవెంట్ల నిర్వహణ స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈవెంట్లలో ఎక్కడా రేవ్ పార్టీస్ ..నిర్ణీత స్థాయికి మించి సౌండ్స్ ...డీజే కూడా రాత్రి 1 గంట తర్వాత తొలగించాలని కోరారు. ఈవెంట్లలో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
డ్రంకెన్ డ్రైవ్ చేస్తే రూ.10 వేల ఫైన్ లేదా ఆర్నెల్ల జైలు శిక్ష ఉంటాయని... డ్రైవింగ్ లైసెన్స్ ను మూడు నెలలు, లేదా అంతకంటే ఎక్కువకాలం, లేదా పర్మినెంటుగా రద్దు చేస్తారని స్పష్టం చేశారు. ఎక్కడా ఆడవారికి ఇబ్బంది కలగకూడదని అన్నారు. మహిళలకు ఇబ్బందులు ఉంటే వెంటనే షీ టీమ్ లను సంప్రదించాలని సీపీ సూచించారు.