బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 98.2 పర్సంట్ ఉత్తీర్ణీత నమోదు కాగా ..రెసిడెన్షియల్ స్కూల్స్ లో 98.7 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధిచారు. ఈ సారి షాకింగ్ గా ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ వారికే ఎక్కువ శాతం ఉత్తీర్ణీత సాధించారు. బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. 99.29 శాతంతో మహబూబాబాద్ జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. 73.97 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఉంది. అయితే పాస్ అవ్వని వాళ్లు జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడువు ఇచ్చారు. ఒక్కో సబ్జెకట్ రీకౌంటింగ్ కు ఐదు వందల రూపాయిలు , రీవెరిఫికేషన్ కు వెయ్యి రూపాయిలు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు మే 15 వరకు అవకాశం కల్పించారు.