కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ఇంకా తన స్టార్డం ని కొనసాగిస్తున్నారు. అలాంటి ఈయన జైలర్, లాల్ సలాం వంటి సినిమాల్లో చేశారు. అయితే ఈ హీరో ఓ హీరో పూజ
న్యూస్ లైన్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ఇంకా తన స్టార్డం ని కొనసాగిస్తున్నారు. అలాంటి ఈయన జైలర్, లాల్ సలాం వంటి సినిమాల్లో చేశారు. అయితే ఈ హీరో ఓ హీరో పూజ వ్రతాన్ని చెడగొట్టారట.మరి ఆ హీరో ఎవరు.. రజినీకాంత్ ఎందుకు అలా చేశారో ఇప్పుడు చూద్దాం. రజినీకాంత్ కి దైవభక్తి ఎక్కువ అనే విషయం మనకు తెలిసిందే. కానీ అలాంటి దైవభక్తి ఉన్న ఈయనే ఓ హీరో దైవభక్తిని పోగొట్టారట.
ఇక అసలు విషయం ఏమిటంటే..ఒకరోజు సినిమా షూటింగ్ సమయంలో రజినీకాంత్ కి పెద్ద క్యారేజీ వచ్చిందట. అందులో అన్ని నాన్ వెజ్ ఐటెమ్సే ఉన్నాయట.ఇక అక్కడే ఉన్న హీరో సుమన్ ని క్యారవాన్ లోకి పిలిచి తినండి అని అన్నారట. సారీ అండి.. ఈరోజు శనివారం నేను నాన్ వెజ్ తినను అని సుమన్ అన్నారట. శనివారం అయితే ఏంటి రేపు ఆదివారం దానికి నాన్ వెజ్ తినడానికి సంబంధం ఏంటి అని రజినీ అన్నారట.
నేను వెంకటేశ్వర స్వామి పై నమ్మకంతో శనివారం రోజు నాన్ వెజ్ తిననని మొక్కుకున్నాను అని సుమన్ చెప్పారట. దానికి రజినీకాంత్ మీ లోపల నెగిటివిటీ ఉండకుండా ఉండాలి.అంతేకానీ నాన్ వెజ్ తింటే ఏమీ కాదు. మీ మనసు లోపల ఎవరిపై కుళ్ళు కుతంత్రాలు లేకపోతే నాన్వెజ్ తిన్నా ఏం కాదు.అలాంటివి పట్టించుకోకూడదు . మీరు గుడికి వెళ్ళినప్పుడు,పూజలు చేసేటప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండండి.
కానీ ఇలాంటివి ఏమీ పాటించకండి. దేవుడు ఏమైనా మనకు ఫోన్ చేసి చెప్పాడా శనివారం రోజు నాన్వెజ్ తినకూడదని అంటూ సుమన్ ని రజినీకాంత్ అన్నారట.రజినీకాంత్ మాటలకు ఇన్స్పైర్ అయ్యి అప్పటినుండి సుమన్ శనివారం రోజు కూడా నాన్ వెజ్ తింటున్నారట. అలా శనివారం నాన్ వెజ్ తినని సుమన్ తో కూడా రజినీకాంత్ నాన్ వెజ్ తినిపించారట