తిరుమల శ్రీవారి ఆలయం ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. అయితే ఈ నెలలో కొన్ని డేట్స్ స్వామివారు సేవలు కొన్ని క్యాన్సిల్ చేశారు. జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా జూలై 9వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. కాబట్టి ఈ తేదీల్లో రికమండేషన్స్ లెటర్స్ ను స్వీకరించడం లేదని టీడీపీ అధికారులు స్పష్టం చేశారు. బ్రేక్ దర్శనాలు కుదరవని తెలిపారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయం ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. అయితే ఈ నెలలో కొన్ని డేట్స్ స్వామివారు సేవలు కొన్ని క్యాన్సిల్ చేశారు. జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా జూలై 9వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. కాబట్టి ఈ తేదీల్లో రికమండేషన్స్ లెటర్స్ ను స్వీకరించడం లేదని టీడీపీ అధికారులు స్పష్టం చేశారు. బ్రేక్ దర్శనాలు కుదరవని తెలిపారు.
సౌరమానం ప్రకారం ఏటా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని అంటారు. ఈ సేవ కోసమే...జూలై8,9,16 తేదీల్లో బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్ చేస్తున్నామని తెలిపారు. టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ఈ రోజునే ప్రారంభమయ్యేవి. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలు వార్షిక బడ్జెట్ ను మార్చి - ఏప్రిల్ నెలకు మార్చారు. అసలు ఆ రోజు ఏ సేవలు చేస్తారో తెలుసుకుందాం..
జూలై 16 ఆణివార ఆస్థానం కారణంగా వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దుచేసింది.