ఏఐ సాయంతో ఉచితంగా సేవలందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: భక్తులకు శ్రీవారి దర్శనం వేగంగా అవ్వడానికి టీటీడీ చర్యలు చేపడుతుంది. దీనికి టెక్నాలజీ వినియోగిస్తూ ఉత్తమ మార్గమని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. దీనికి గాను చంద్రబాబు గూగుల్ తో ఒప్పందానికి టీటీడీ సిద్ధమవుతుంది. ఏఐ సాయంతో ఉచితంగా సేవలందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది.
వారం పదిరోజుల్లో టీటీడీ -గూగుల్ మధ్య డీల్ కుదరనుంది. తర్వాత గూగుల్ అధికారులు క్షేత్రస్థాయిలు లో పర్యటించి కసరత్తును పూర్తిచేస్తారు. తిరుమలలో ఏఐని తిరుమలలో ప్రయోగాత్మకంగా వాడతారు. చాలా దేవలయాలు ఏఐని వాడుతున్నా..అవన్నీ పేరుకు మాత్రమే పరిమితమయ్యాయి. దర్శన విధివిధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులూ తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
స్వామి వారి దేవాలయంలో ఏ టైంలో ఎలా ఉంది. ప్రసాదం కౌంటర్ దగ్గర జనాలు ఎంతమంది ఉన్నారు . లాంటి డీటైల్స్ ను ఈ ఏఐ సాయంతో తెలుసుకోవచ్చు.భవిష్యత్తులో ఆ వ్యక్తి ఆ ఐడీ ద్వారానే దర్శనం, సేవలు, గదులను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు? ఎన్ని గదులు తీసుకున్నారు? అన్న సమస్త సమాచారమూ టీటీడీకి తెలుస్తుంది.