అమెరికా చైనా మధ్య ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది ఒకవేళ ఇది జరిగితే మాత్రం బంగారం ధరలు తగ్గి వస్తాయంటున్నారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గోల్డ్ రేటు మరింత పెరిగింది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయిని దాటి ముందుకు వెళ్తున్నాయి. మే 8వ తేదీ గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి . 24 క్యారట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91150గా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ. 98411గా ఉంది. పసిడి ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరగడమే అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆర్ధిక పరిస్థితుల దృశ్యా బంగారం పై పెట్టుబడులు ఎక్కువయ్యాయి.ఫలితంగా బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి.
అయితే అమెరికా చైనా మధ్య ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది ఒకవేళ ఇది జరిగితే మాత్రం బంగారం ధరలు తగ్గి వస్తాయంటున్నారు ఎంత తగ్గినా మరీ 50 వేలకు చేరుకొనే అవకాశం మాత్రం లేదంటున్నారు.అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ఎంతరేటున్నా కొంటున్నారు. కాని కొన్ని రోజులు వేచి చూస్తే కాస్త ధరలు తగ్గే అవకాశముందంటున్నారు. అయితే వెండి ధరలు కూడా ఇలానే పెరుగుతున్నాయి. కేజీ వెండి రూ. 1,11,000 గా నడుస్తుంది.