rajnath singh: ఈ రోజు మన సైన్యం లంకా దహనమే చేశారు !

కేంద్రపాలిత ప్రాంతాలలో 50 బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు.


Published May 07, 2025 07:52:00 PM
postImages/2025-05-07/1746627823_750x450851494rajath.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హనుమాన్ లంకాదహనం చేసినట్టే మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ కు మాత్రమే కాదు భారత్ ను చిన్న అంచనా వేసిన వారందరికి సమాధానం చెప్పారు. హనుమాన్‌ లంకా దహనం చేసినట్లే.. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 50 బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. మన సైనికులు రాత్రి ఒక చరిత్ర సృష్టించారన్నారు. 


ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అభినందనలు తెలిపారు. సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని.. ప్రజలు బయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. పహల్గాంలో అమాయకులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారని ఆరోపించారు. పహల్గాంలో అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. శత్రువులకు సరైన బుధ్ధి చెబుతామన్నారు. దేశ భద్రతకు కాని ప్రజలకు కాని ఏదైనా విపత్తు సృష్టిస్తే ఎవరిని వదలమని ...లంకాదహనం మరో సారి మన సైనికులు గుర్తుచేశారని అన్నారు.. భారత్‌ లక్ష్యం పాకిస్తాన్‌ కాదని.. ఉగ్రవాదులేనన్నారు రాజ్ నాథ్ సింగ్ .

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rajnath-singh operation-sindhoor

Related Articles