ప్రజలు , సహాయక సిబ్బంది వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హైదరాబాద్ లో చాలా చోట్ల సైరన్లు మోగాయి. 'ఆపరేషన్ అభ్యాస్' పేరుతో హైదరాబాద్‌లో సివిల్ మాక్‌డ్రిల్ ప్రారంభమైంది. సివిల్ మాక్ డ్రిల్ లో చాలా విభాగాల్లో సిబ్బంది పాల్గొన్నారు. పాకిస్థాన్ తో యుధ్ధం వస్తే అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహనకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజలు , సహాయక సిబ్బంది వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు.
హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లు , అపార్ట్ మెంట్ల దగ్గర సైరన్లు మోగాయి. హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. నానల్ నగర్ , కంచన్ బాగ్ , సికింద్రాబాద్ , ఈ సీఐఎల్ ఎన్ ఎఫ్ సీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. సివిల్ మాక్ డ్రిల్ లో పాల్గొన్న ఎన్డీఆర్ ఎప్ , ఎస్డీ ఆర్ ఎఫ్ , రక్షణశాఖ, అగ్నిమాపకశాఖ సిబ్బంది పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.
కేంద్రం ఆదేశాల ఇస్తుంది. అప్పటి వరకు ప్రజలు ఎలాంటి ఫేక్ వార్తలు నమ్మరాదని తెలిపారు. 2 నిమిషాలు పాటు సైరన్ మోగించి అప్రమత్తం చేశామని, 4 ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగినట్లు మాక్‌డ్రిల్ చేశామని అన్నారు. దాడులు జరిగిన తర్వాత తీసుకునే సహాయక చర్యలు చేసి చూపించామని , క్షతగాత్రులను తరలించే విధానంపై అవగాహన కల్పించడానికే ఈ ఆకస్మిక మాక్ డ్రిల్స్ అని తెలిపారు.అత్యవసర పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ మాక్‌డ్రిల్ అని జరిగిన లోపాలను సమీక్షించుకుని మరింత మెరుగ్గా చేస్తామని తెలిపారు.