india: ఫస్ట్ టైం ...పార్టీ జెండాలేవి లేవు...జస్ట్ భారత్ జెండా మాత్రమే !

"ఆపరేషన్ సిందూర్ " ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు , అంతెందుకు కాంగ్రెస్ స‌హా.. క‌మ్యూనిస్టుల వరకు అందరు ఏకపక్షంగా అభినందిస్తున్నారు. 


Published May 07, 2025 07:23:00 PM
postImages/2025-05-07/1746626128_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారతదేశానికి శత్రువులు కొత్తేం కాదు..భారత్ ఇంట బయట ..శత్రువులతో ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంది. అంద‌రినీ ఒకే తాటిపై న‌డిపించ‌డంలోనూ.. మాత్రం ఇప్పుడు కొత్త పంథా అనుస‌రించింది. అది కూడా భిన్న‌మైన అంత‌ర్గ‌త రాజ‌కీయాల్లో ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం ఏక‌త్వాన్ని ద‌క్కించుకుంది. "ఆపరేషన్ సిందూర్ " ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు , అంతెందుకు కాంగ్రెస్ స‌హా.. క‌మ్యూనిస్టుల వరకు అందరు ఏకపక్షంగా అభినందిస్తున్నారు. 


ఉదాహ‌ర‌ణ‌కు చైనా-భార‌త్ స‌రిహ‌ద్దుల్లోని గాల్వాన్ లోయ‌లో 2020లో జ‌రిగిన దాడిపై క‌మ్యూనిస్టులు క‌న్నెర్ర చేశారు. భారత్ జాగ్రత్తగా ఉంటే ఈ ఉపద్రవం వచ్చేది కాదన్నారు. ఇక ఉరిసెక్టార్ లో  ఉగ్రమూకలు రణరంగం సృష్టించినపుడు అన్ని పార్టీలు మోదీ ని తప్పు పట్టాయి. ఆయన సరైన విధంగా ఎదుర్కొనలేదని , ఆర్మీని సిధ్ధం చెయ్యలేకపోయారని మాటల తూటాలు పేల్చారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసినపుడు కూడా మోదీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్లు చేశారు.


కాని ఈ సారి ‘ఆప‌రేష‌న్ సిందూర్‌’ మాత్రం దీనికి భిన్నంగా మారింది. కొంచెం లేటైనా.. వాటంగా పాక్‌కు జ‌వాబు చెప్పార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఒక్కరు కాదు...అసలు మోడీ అంటేనే పడని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా మంచి పని చేశారంటూ పొగడడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పెద్ద మనిషి రాహుల్ , తమిళనాడు సీఎం వరకు బీజేపీ అంటే గిట్టని వాళ్లు కూడా మోదీ చేసిన పనికి జై కొట్టారు.
మోడీ వ‌ల‌న‌- మోడీ చేత‌- అంటూ.. ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న‌ను కొనియాడుతున్నారు. బుధ‌వారం రాత్రి 7 నుంచి 8 మ‌ధ్య కొవ్వుత్తుల ర్యాలీలు, ప‌హ‌ల్గామ్ మృతుల‌కు మ‌రోసారి నివాళుల‌ర్పించే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. భారత్ సత్తా మరోసారి ప్రపంచ దేశాలకు చూపించారు మోదీ.. జైహింద్ .
 

newsline-whatsapp-channel
Tags : narendra-modi india pakistan operation-sindhoor

Related Articles