వంట పాత్రలు, గ్రైండర్లు కడగకుండానే వాడుతున్నారని.. పులిసిపోయిన పిండి కలిపిన పెరుగు, చపాతీల్లో మైదా పిండి, నీళ్ల సాంబారు పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఏలూరు నూజివీడు ట్రిపుల్ ఐటీలో అపరిశుభ్ర వాతావరణం, నాసిరకం ఆహారం పెడుతున్నట్లు సమాచారం. దీంతో ఈ ఆహారం తిన్న 1300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అల్లాడిపోతున్నా యాజమాన్యం విషయం బయటకు రాకుండా దాచి పెట్టిందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
వంట పాత్రలు, గ్రైండర్లు కడగకుండానే వాడుతున్నారని.. పులిసిపోయిన పిండి కలిపిన పెరుగు, చపాతీల్లో మైదా పిండి, నీళ్ల సాంబారు పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 1000 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తాజగా, ఈ సంఖ్య 1300కు చేరింది. అయితే, ఈ ఇటీవల మంత్రి కొలుసు పార్థసారథి వచ్చినప్పుడు తమ సమస్యలు చెప్పుకోవడాని ప్రయత్నిస్తే యాజమాన్యం చెప్పనివ్వలేదని విద్యార్థులు వాపోయారు. హాస్టల్ గదుల్లో తాళం వేసి తమను బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.