వేగంగా వచ్చిన స్కూల్ బస్సు హారికను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదారు అడుగుల దూరంలో ఎగిరిపడ్డ హారిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
న్యూస్ లైన్ డెస్క్ : సోమవారం నాడు సాయంత్రం కురిసిన భారీ వర్షం ఓ యువతి ప్రాణాలు తీసింది. అత్తాపూర్ కు చెందిన హారిక అనే యువతి ఓ ప్రేవట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తోంది. పని గంటలు ముగిసిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చింది.
వర్షం ఎక్కువ ఉండటంతో తడవకుండా ఉండేందుకు పిల్లర్ నెంబర్ 130 వద్ద గల ఫ్లై ఓవర్ కింద నిల్చుంది. సరిగ్గా అదే సమయంలో వేగంగా వచ్చిన స్కూల్ బస్సు హారికను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదారు అడుగుల దూరంలో ఎగిరిపడ్డ హారిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని హాస్పిటల్ కు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హారిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.