సౌదీలో ఓ వలస కార్మికుడు ఎదుర్కొన్న దారుణ అనుభవాలను తెరకెక్కించిన సినిమా ‘ఆడు జీవితం’.. నిజజీవిత కథ ఆధారంగా నిర్మించిన ఈ మలయాళ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇందులో వలస కార్మికుడిగా పృథ్వీ రాజ్ నటనకు 100 మార్కులు పడ్డాయి. విమర్శకులకు కూడా నోట మాట రాలేదు. బ్లెస్సీ దర్శకత్వంలో రూ.82 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ సినిమా రూ.160 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కోసం హీరో దాదాపు 16 యేళ్లు కష్టపడినట్లు రీసెంట్ గా బీలీవుడ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు పృథ్వీ.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సౌదీలో ఓ వలస కార్మికుడు ఎదుర్కొన్న దారుణ అనుభవాలను తెరకెక్కించిన సినిమా ‘ఆడు జీవితం’.. నిజజీవిత కథ ఆధారంగా నిర్మించిన ఈ మలయాళ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇందులో వలస కార్మికుడిగా పృథ్వీ రాజ్ నటనకు 100 మార్కులు పడ్డాయి. విమర్శకులకు కూడా నోట మాట రాలేదు. బ్లెస్సీ దర్శకత్వంలో రూ.82 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ సినిమా రూ.160 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కోసం హీరో దాదాపు 16 యేళ్లు కష్టపడినట్లు రీసెంట్ గా బీలీవుడ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు పృథ్వీ.
దాదాపు నాలుగు నెలలు గడిచిన తర్వాత తాజాగా ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ కు మూహూర్తం కుదిరింది. ఈ నెల 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ అఫిషియల్ గా కూడా అనౌన్స్ చేసింది. మలయాళంతోపాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
నజీబ్ మహ్మద్ అనే కుర్రాడి లైఫ్ జరిగిన రియల్ ఇన్సిడెంట్ ను ..బెన్యామిన్ అనే రచయిత ‘గోట్ డేస్’ పేరుతో ఓ నవల రాశారు. 2008లో మలయాళంలో అత్యధికంగా అమ్ముడుపోయిన నవలగా ఇది రికార్డులు సృష్టించింది. ఈ నవల ఆధారంగా సినిమా తీసి బ్లెస్సీ హిట్టు కొట్టారు. దాదాపు పదేళ్లకు పైగా స్క్రిప్ట్ వర్క్ చేశారు. కథను చెప్పే కంటే చూడడం చాలా బాగుంటుంది. కేరళ నుంచి వెళ్లిన ఓ కుర్రాడిని సౌదీలో ఓ ఏజెంట్ మోసం చేస్తాడు. ఇక చేసేది లేక ఎడారిలో గొర్రెల కాపరి గా పనిచేస్తుంటాడు. అక్కడ యజమాని పెట్టిన కష్టాలు...తప్పించుకోలేక పడిన నరకయాతనను సినిమా గా తీశారు. సుకుమారన్ అధ్భుతంగా నటించారు.