ఇంతకుముందు 'ఎన్టీఆర్ బయోపిక్'లో బాలయ్య సరసన విద్యాబాలన్ నటించిన విషయం తెలిసిందే.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాలయ్య బాబు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫస్ట్ లీడ్ లో 'అఖండ 2 – తాండవం' తెరకెక్కిస్తున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అయితే ఈ అఖండ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ కీలక పాత్ర చేస్తున్నట్లు టాక్. అది కూడా ఓ పొలిటికల్ లీడర్ గా విద్యాబాలన్ కనిపిస్తుందట. ఇంతకుముందు 'ఎన్టీఆర్ బయోపిక్'లో బాలయ్య సరసన విద్యాబాలన్ నటించిన విషయం తెలిసిందే.
మార్చి ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ మూవీ తర్వాత షూట్ ను హిమాలయాల్లో స్టార్ట్ చేసేందుకు అన్ని సన్నాహాలు చేశారు. అందులో భాగంగా రీసెంట్ గా డైరక్టర్ తన టీమ్ తో కలిసి హిమాలయాల్లోని చాలా లొకేషన్స్ చూశారట. ఇక ఈ షెడ్యూల్‌లో బాలయ్య అఖండ పాత్రపై పలు ఇంపార్టెంట్ సీన్స్‌తో పాటు ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌ను తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.
బాలయ్యతో పాటు సంయుక్తా మేనన్, ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్తో పాటు యంగ్ హీరో ఆది పినిశెట్టి నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో యాక్ట్ చేస్తున్నట్లు టాక్. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25 న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.