Alluarjun:సెంటిమెంట్.. ఆ 2 పాటిస్తే సినిమా హిట్టే.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ, దానిపై ఆధారపడకుండా సొంతంగా తన నటన టాలెంట్ తో ఎదిగారు. అలాంటి అల్లు అర్జున్ మొదట్లో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలామంది వీడు హీరోనా అంటూ ఎద్దేవా చేశారు. కానీ అవి ఏవి పట్టించుకోకుండా అల్లు అర్జున్ తన టాలెంట్ ని నమ్ముకొని  ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయ్యారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-13/1720844371_allu123.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ, దానిపై ఆధారపడకుండా సొంతంగా తన నటన టాలెంట్ తో ఎదిగారు. అలాంటి అల్లు అర్జున్ మొదట్లో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలామంది వీడు హీరోనా అంటూ ఎద్దేవా చేశారు. కానీ అవి ఏవి పట్టించుకోకుండా అల్లు అర్జున్ తన టాలెంట్ ని నమ్ముకొని  ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయ్యారు.

ఇక కొన్ని పాత్రలు చూస్తే అది అల్లు అర్జున్ తప్ప వేరే ఎవరికీ సెట్ కావు అనిపిస్తుంది. ఆ విధంగా పాత్రలో నటించడం కాదు జీవించేస్తారు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న అల్లు అర్జున్ స్టైల్ మరోలా ఉంటుంది. అందుకే ఆయనను ఐకాన్ స్టార్ అంటారు. అలాంటి అల్లు అర్జున్ ఏ సినిమాలో నటించినా ఆ రెండు సెంటిమెంట్స్ తప్పకుండా ఫాలో అవుతారట. అవేంటో చూద్దాం..

అయితే ఇండస్ట్రీలో ఉండేటువంటి డైరెక్టర్లకు నిర్మాతలకు హీరో, హీరోయిన్లకు ఇలా ఎంతోమందికి సెంటిమెంట్స్ ఉంటాయి.ఆ సెంటిమెంట్ ప్రకారమే వారు సినిమాల్లో నటిస్తూ ఉంటారు.ఆ విధంగా అల్లు అర్జున్ కు కూడా రెండు సెంటిమెంట్లు ఉన్నాయట.ప్రతి సినిమాలో తప్పకుండా వాడుకుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అల్లు అర్జున్ ఏ సినిమా చేసిన దాన్ని తప్పకుండా ఏప్రిల్ లో రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఉంటుంది.  అందుకే ఏప్రిల్ నెలలోనే  బన్నీ, రేసుగుర్రం, వంటి చిత్రాలు రిలీజ్ చేశారు.  

ఆ సినిమాలు భారీ హీట్ అయ్యాయి. ఇక ఇవే కాకుండా  ఆయన ఏ సినిమా అయినా కొంత భాగాన్ని వైజాగ్ లో చిత్రీకరణ జరిగేటట్టు చూసుకుంటారు. ఆయన సినిమాలో తప్పకుండా వైజాగ్ ఉంటే మాత్రం ఆ సినిమా తప్పక హిట్ అవుతుందనే సెంటిమెంటు ఫాలో అవుతారు. అందుకే ఆయన చేసిన గంగోత్రి, బన్నీ, దేశముదురు, ఆర్య సినిమాలన్నీ వైజాగ్ లోనే చిత్రీకరణ చేశారు. ఆ సినిమాలు కూడా బంపర్ హిట్ అయ్యాయి. ఈ విధంగా అల్లు అర్జున్ ఈ రెండు సెంటిమెంట్లు ప్రతి సినిమాలో ఫాలో అవుతూ వస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu allu-arjun gangotri icon-star bunny vizag

Related Articles