అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో తిరుగులేని హీరో.. అలాంటి ఈయన ఇప్పటికి ఆరు పదుల వయస్సు దాటిన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి నాగార్జున సినిమా కెరియర్ పరంగా ఎంతో
న్యూస్ లైన్ డెస్క్: అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో తిరుగులేని హీరో.. అలాంటి ఈయన ఇప్పటికి ఆరు పదుల వయస్సు దాటిన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి నాగార్జున సినిమా కెరియర్ పరంగా ఎంతో స్టార్డం తెచ్చుకున్న సొంత లైఫ్ లో మాత్రం కాస్త డిస్టర్బ్ అయ్యారు. మొదటగా ఆయన మూవీ మొగల్ రామానాయుడు కూతురు లక్ష్మీని పెళ్లి చేసుకొని నాగచైతన్య పుట్టిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత మరో హీరోయిన్ అయినటువంటి అమలను వివాహం చేసుకున్నారు.
వీరిద్దరూ కలిసి చినబాబు, ప్రేమ యుద్ధం, శివ, నిర్ణయం కిరాయి దాదా, వంటి చిత్రాల్లో నటించారు. ఈ సినిమాల సమయంలోనే వీరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా అమల నాగార్జున కంటే ముందు మరో హీరోతో లవ్ లో పడిందట. దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తమిళ హీరో కార్తీక్ తో అమల ప్రేమలో పడ్డారని, వీరిద్దరూ కలిసి ఘర్షణ సినిమాలో నటించారని ఈ టైం లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. కానీ వీరి ప్రేమ గురించి ఎక్కువగా బయట తెలియదు. కొన్నాళ్లపాటు సాగిన తర్వాత వీరి మధ్య ఏమైందో ఇద్దరు విడిపోయారట. అదే సమయంలో అమలు కూడా తమిళ ఇండస్ట్రీ గుడ్ బై చెప్పి తెలుగులోకి వచ్చింది. ఇక్కడ నాగార్జున తో సినిమాలు చేసి చివరికి ఆయననే పెళ్లి చేసుకుంది. వీరికి సంతానంగా అఖిల్ జన్మించారు.