ఒకటి అండమాన్ నికోబార్ దీవులు. అసలు బీచ్ ను ఎక్కడ చూసినా అందంగానే ఉంటుంది. కాని అండమాన్ లో చూస్తే ఇంకా బాగుంటుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలోనే అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాలల్లో ఒకటి అండమాన్ నికోబార్ దీవులు. అసలు బీచ్ ను ఎక్కడ చూసినా అందంగానే ఉంటుంది. కాని అండమాన్ లో చూస్తే ఇంకా బాగుంటుంది. అక్కడికి వెళ్లాలని చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. కాని ప్లాన్ ఎలా వెయ్యాలో తెలీదు.అయితే మీకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. డీటైల్స్ మీ కోసం.
అమేజింగ్ అండమాన్ ఎక్స్ హైదరాబాద్ పేరుతో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ ఐలాండ్, నెయిల్ ఐలాండ్ లాంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. జస్ట్ 5 రాత్రులు , 6 రోజులు ఈ ప్యాకేజీ . హైదరాబాద్ టు అండమాన్ ఫ్లైట్ లో వెళ్తారు. ఇక అక్కడ రూమ్స్, ఫుడ్ అంతా ఐఆర్ సీ టీసీ చూసుకుంటుంది.
ఉదయం 06.35 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది.
మొదట పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు.
సెల్యూలార్ జైల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు.
తర్వాత కోర్బికోవ్ బీచ్‌కు వెళతారు.
ఆ తర్వాత సెల్యూలార్ జైల్ వద్ద లైట్ అండ్ సౌండ్ షో విజిట్ చేస్తారు. ఫస్ట్ రోజు ముగుస్తుంది.
* రెండో రోజు
రోస్ ఐలాండ్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత నార్త్ బే ఐలాండ్ వెళ్తారు.
ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి . వెళ్లొచ్చు. పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకుని లంచ్ పూర్తి చేసిన తర్వాత టైమ్ ఉంటే సాముద్రిక మెరైన్ మ్యూజియం విజిట్ చేస్తారు. లోకల్ మార్కెట్స్ లో షాపింగ్ చేసుకోవచ్చు.
హావ్‌లాక్ ఐలాండ్‌కు వెళ్తారు. రాధానగర్ బీచ్ కు వెళ్లొచ్చు. ఇక ఇక్కడ నుంచి కాలాపత్తర్ బీచ్ కు వెళ్తారు. నెయిల్ ఐలాండ్ కోసం ప్రీమియం లగ్జరీ క్రూయిజ్ ఎక్కుతారు. ఈ క్రూయిజ్ చాలా మంచి ఎక్స్ పీరియన్స్ . ఇలా లోకల్ లో ఉండే అన్ని ప్లేసులు కవర్ చేసి లాస్ట్ రోజు మళ్లీ ఫ్లైట్ ఎక్కిస్తారు. మరి రేట్లు ఏంటో చూద్దాం.
5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.46,600 చెల్లించాలి. బెడ్ వద్దని చెప్పే ఆప్షన్ లేదు. సో చిన్నారులకు డబ్బు కట్టాల్సిందే.
పెద్ద వారికి ఒక్కొక్కరికి దాదాపు 58 వేల రూపాయిలు. అది కూడా ముగ్గురు కలిపి ఒక రూమ్ లో ఉంటే..సింగిల్ గా రూమ్ కావాలంటే 71 వేలు కట్టాల్సిందే. కాస్త రేటు ఎక్కువే కాని అంతే లగ్జరీ ట్రిప్ ను ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇక ఇక్కడ నుంచి 6 రోజులు మీ బాధ్యత వాళ్లదే.