Revanth reddy: స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ప్రముఖ బిజినెస్ మ్యాన్

యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ఏటా 20వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. 


Published Aug 05, 2024 03:56:49 PM
postImages/2024-08-05/1722853609_skilluniversity.jpg

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్తను నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీ పరిధిలో బ్యాగరికంచె వద్ద తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనానికి సీఎం ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ఏటా 20వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

రానున్న రోజుల్లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా స్కిల్ వర్సిటీని విస్తరించనున్నట్లు తెలిపారు. బ్యాగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) భవంతి నుంచి స్కిల్‌ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్రాను వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నరేవంత్ న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. త్వరలోనే ఆనంద్ మహీంద్రా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. 
 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line newslinetelugu cm-revanth-reddy anandmahindra skilluniversity skilluniveristychairman esci

Related Articles