Ananth Ambani:పెళ్లయిన 2 నెలలకే రాధిక ప్రెగ్నెంట్..!

దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంది.  అలాంటి ముకేశ్ అంబానీ ఇంట్లో రెండవ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జూలై 12వ తేదీన అంగరంగ


Published Sep 10, 2024 07:40:31 PM
postImages/2024-09-10/1725977431_radhika.jpg

న్యూస్ లైన్ డెస్క్: దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంది.  అలాంటి ముకేశ్ అంబానీ ఇంట్లో రెండవ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జూలై 12వ తేదీన అంగరంగ వైభవంగా ముంబైలో జరిగింది. ఈ పెళ్లికి ప్రపంచ దేశాలలోని రాజకీయ నాయకులతో పాటు పెద్ద పెద్ద బిజినెస్ మేన్స్ హాజరయ్యారు. అయితే ఈ వివాహం దేశంలోని అత్యంత కాస్ట్లీ వివాహంగా పేరు   తెచ్చుకుంది. అలా వేలాదిమంది  అతిధుల మధ్య అనంత్ అంబానీ రాధిక మర్చంట్  దంపతులయ్యారు. అయితే వీరిద్దరు పెళ్లి తర్వాత హనీమూన్ కోసం కూడా విదేశాలు వెళ్లి అద్భుతంగా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది.

అయితే పెళ్లయిన రెండు నెలలు కూడా పూర్తిగా నిండకముందే రాధిక మర్చంట్  ప్రెగ్నెంట్ అయినట్టు తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. అయితే వినాయక చతుర్థి సందర్భంగా అంబానీ ఇంట్లో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి ఎంతోమంది ప్రముఖులు తరలివచ్చారు. అయితే ఈ వేడుకలో అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ జరిగిన ఒక సన్నివేశం చూసి ఇక రాధిక మర్చంట్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో అనేక వార్తలు రాసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ వేడుకలో రాధిక మర్చంట్  నిండైన చీరకట్టుతో  హై హీల్స్ వేసుకోకుండా షూలు వేసుకొని  కనిపించారు.

అంతేకాకుండా తన అత్తగారైన నీతా అంబానీ చిన్న కోడలు రాధిక మర్చంట్ ను  ఆ వేదికపై చాలా జాగ్రత్తగా పట్టుకొని కింద పడిపోకుండా  చూస్తోంది. రాధిక మర్చంట్ కూడా చాలా స్లోగా నడుస్తూ కడుపుపై చేతులు పెట్టుకొని ఉన్నది. అయితే ఈ వీడియో చూసినటువంటి చాలామంది నెటిజన్స్ అనంత్ అంబానీ తండ్రి కాబోతున్నాడు అంటూ వార్తలు రాస్తున్నారు. అంతే కాదు అనంత్ ఫ్యామిలీకి విషెస్ కూడా చెబుతున్నారు. ఈ వీడియో చూసిన చాలామంది తప్పక రాధిక మర్చంట్ ప్రెగ్నెంట్ అయింది, అనంత్ చాలా స్పీడున్నాడంటూ నెట్టింటా వార్తలు హల్చల్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/C_oGrLLMbEt/?igsh=dHRxc3gwYWF5eGRm

newsline-whatsapp-channel
Tags : marraige, newslinetelugu ananth-ambani mukesh-ambani radhika-marchant-pregnant

Related Articles